Share News

Congress: టార్గెట్ 14పై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్

ABN , Publish Date - Mar 22 , 2024 | 09:33 PM

పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్(Congress) హై కమాండ్ ఫోకస్ పెట్టింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన బూస్టప్‌తో అత్యధికంగా ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పలు ప్రణాళికలు రచిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 14 ఎంపీ స్థానాలు కచ్చితంగా గెలిచేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.

Congress: టార్గెట్ 14పై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్(Congress) హై కమాండ్ ఫోకస్ పెట్టింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన బూస్టప్‌తో అత్యధికంగా ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పలు ప్రణాళికలు రచిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 14 ఎంపీ స్థానాలు కచ్చితంగా గెలిచేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. టార్గెట్ 14పై యాక్షన్ ప్లాన్ సిద్ధం అమల్లోకి తీసుకురానున్నారు. అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. మూడంచెలుగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయిదుగురు కీలక సభ్యులతో బూత్ కమిటీలు నియమించేలా ప్లాన్ చేశారు.

ఎన్నికలయ్యేంత వరకు ముఖ్య నేతలందరూ కలిసికట్టుగా బాధ్యతలను పంచుకోవాలని రేవంత్ సూచించారు. నాయకులంతా కార్యకర్తలకు వెన్నంటి ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. మల్కాజ్‌గిరి ఎన్నికల మోడల్‌ను రాష్ట్రమంతటా అనుసరించాలని రేవంత్ కేడర్‌కు ఆదేశించారు. రెండు రోజుల్లోనే అన్ని నియోజకవర్గాల్లోనే సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ స్థాయి, అసెంబ్లీ, బూత్ స్థాయిల్లో మూడంచెలుగా పార్టీ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసేలా సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2024 | 09:33 PM