Share News

మూడు జిల్లాల్లో 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

ABN , Publish Date - Nov 30 , 2024 | 05:07 AM

రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

మూడు జిల్లాల్లో 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గురువారం రాత్రి మూడు జిల్లాల్లో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(యు)లో అత్యల్పంగా 8.1డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, మెదక్‌ జిల్లా నాల్కల్‌లో 8.2డిగ్రీలు, అలాగే ఆదిలాబాద్‌ భీంపూర్‌ మండలం అర్లి(టి)లో 8.2డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లోని జైనథ్‌, బేలలో 8.4, 8.5డిగ్రీలకు పడిపోయాయి.


సంగారెడ్డి జిల్లా కోహీర్‌, నల్లవల్లి, సత్వార్‌ ప్రాంతాల్లో 9.1, 9.2, 9.3డిగ్రీల కనిష్ఠ ఉష్ణ్గోగ్రతలు రికార్డ్‌ అయ్యాయి. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ను చలిపులి వణికిస్తోంది. గతేడాది నవంబరుతో పోలిస్తే ఈ ఏడాది నగరంలో చలి తీవ్రత అధికమైంది. 2023లో ఈనెలలో 18డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈ సంవత్సరం అది 16డిగ్రీల దిగువకు పడిపోయింది. గురువారం రాత్రి అత్యల్పంగా పటాన్‌చెరులో 11డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, రేపు, ఎల్లుడి రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.

Updated Date - Nov 30 , 2024 | 05:07 AM