CM Revanth Reddy: ఈ ప్రభుత్వం అందరిదీ.. సర్వమతాలకు స్వేచ్ఛ కల్పిస్తాం..
ABN , Publish Date - Jul 08 , 2024 | 04:43 AM
‘‘ఈ ప్రభుత్వం అందరిదీ. సర్వమతాలకు స్వేచ్ఛ, అవకాశాలను కల్పిస్తుంది. మత సామరస్యాన్ని పాటిస్తుంది’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.

ఇస్కాన్ ‘పూరిజగన్నాథ రథయాత్ర’లో సీఎం రేవంత్‌రెడ్డి
కవాడిగూడ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ‘‘ఈ ప్రభుత్వం అందరిదీ. సర్వమతాలకు స్వేచ్ఛ, అవకాశాలను కల్పిస్తుంది. మత సామరస్యాన్ని పాటిస్తుంది’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పూరి జగన్నాథ రథయాత్రను ఆయన ప్రారంభించారు. ఆబిడ్స్ ఇస్కాన్ దేవాలయం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రథయాత్రకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందిరాపార్కు వద్ద రథయాత్రలో కొలువుదీరిన జగన్నాథుడికి సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని భగవంతుణ్ని కోరుకున్నట్లు రేవంత్ తెలిపారు. రాష్ట్రంలో హింస, డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, దీనికి ప్రజలు కూడా తమవంతు సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆబిడ్స్ ఇస్కాన్ దేవాలయానికి సేవలు చేస్తున్న వారికి ప్రసాదం, అవార్డులను అందజేశారు.