Railway Terminal: చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవం వాయిదా
ABN , Publish Date - Dec 28 , 2024 | 03:51 AM
చర్లపల్లి కొత్త రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. రూ.4.13 కోట్లతో నిర్మించిన ఈ శాటిలైట్ టెర్మినల్‌ను శనివారం రైల్వే మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

మాజీ ప్రధాని మన్మోహన్ మృతి నేపథ్యంలోనే..
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 27 (ఆంఽధ్రజ్యోతి): చర్లపల్లి కొత్త రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. రూ.4.13 కోట్లతో నిర్మించిన ఈ శాటిలైట్ టెర్మినల్‌ను శనివారం రైల్వే మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే.. గురువారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో కేంద్రం వారం రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది.
ఈ సమయంలో రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించడం సమంజసం కాదని భావించిన కేంద్ర ప్రభుత్వం.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని దక్షిణ మధ్య రైల్వేను ఆదేశించింది. దీంతో టెర్మినల్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. అయితే రెండు నెలల్లో మొత్తంగా నాలుగు సార్లు టెర్మినల్ ప్రారంభోత్సవం వాయిదా పడడం రైల్వే వర్గాలను తీవ్రంగా నిరాశపరిచింది.