CMR: సీఎంఆర్ గడువు పొడిగించిన కేంద్రం
ABN , Publish Date - Dec 27 , 2024 | 05:55 AM
కేంద్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరం యాసంగి సీజన్‌కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును పెంచింది.

హైదరాబాద్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరం యాసంగి సీజన్‌కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును పెంచింది. ఈనెల 15వ తేదీతో సీఎంఆర్ గడువు పూర్తవడంతో అప్పటి నుంచి ఎఫ్‌సీఐ తెలంగాణ నుంచి బియ్యం సేకరణను నిలిపేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వానికి గతంలోనే లేఖ రాయగా.. తాజాగా మళ్లీ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. . దీంతో గతేడాది యాసంగి సీజన్‌కు సంబంధించిన బియ్యం డెలివరీకి నెల రోజుల అదనపు సమయం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు వెలువరించింది. 2025 జనవరి 25తేదీ నాటికి సీఎంఆర్ లక్ష్యాన్ని పూర్తిచేయాలని తుది గడువు విధిస్తూ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి దీపేంద్ర సింగ్ ఉత్తర్వులు జారీచేశారు.