Share News

Madhavi Latha: మాధవి లతపై దాడి కేసులో ఎంఐఎం నేతలపై కేసు

ABN , Publish Date - May 16 , 2024 | 06:55 PM

హైదరాబాద్(hyderabad) లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత(madhavi latha) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై తాజాగా ఎంఐఎం నేతలపై కేసు నమోదైంది. మాధవి లత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్ పురా పోలీసులు(police) కేసు నమోదు చేశారు.

Madhavi Latha: మాధవి లతపై దాడి కేసులో ఎంఐఎం నేతలపై కేసు
madhavi latha mim case

హైదరాబాద్(hyderabad) లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత(madhavi latha) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై తాజాగా ఎంఐఎం నేతలపై కేసు నమోదైంది. మాధవి లత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్ పురా పోలీసులు(police) కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో 147, 506, 509, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.


లోక్‌సభ ఎన్నికల(loksabha election 2024) సందర్భంగా పోలింగ్ బూత్ లను పరిశీలించడానికి వెళ్లిన మాధవి లతపై యాకత్ పూర ఎంఐఎం ఇంఛార్జ్ యాసిర్ అర్ఫాత్ దాడి చేసేందుకు ప్రయత్నించారని నసీం అన్నారు. అంతేకాదు ఆమె కారులో వెళ్తున్న క్రమంలో కూడా పలువురు ఎంఐఎం నేతలు వెంట పడి దాడి చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. దీంతోపాటు బీబీ బజార్‌లో మాధవి లతను 100 మంది ఎంఐఎం నాయకులు ముట్టడించారని తెలిపారు. ఈ నేపథ్యంలో వీరందరికీ పోలీసులు 41 crpc నోటీసులు జారీ చేయనున్నారు.


మరోవైపు హైదరాబాద్(hyderabad) లోక్‌సభ నియోజక వర్గంలో భారీ రిగ్గింగ్ జరిగిందని కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ జరపాలని మాధవి లత వ్యాఖ్యానించారు. ఈ నియోజకవర్గంలో రిగ్గింగ్‌పై ఫిర్యాదులు చేసినా పోలీసులు మౌనంగా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. 16 ఏళ్ల బాలిక రెండుసార్లు ఓటు వేయడానికి ప్రయత్నించిందని, కానీ ఎటువంటి చర్య తీసుకోలేదని అన్నారు.


ఇవి కూడా చదవండి...

TS News: అలర్ట్.. అలర్ట్.. మరో ఐదు రోజులు వర్షాలు..!!


Prathipati Pullarao: పల్నాడు హింసకు కారణాల్లో పోలీసుల తీరుపైనే అనుమానాలు

Read Latest Telangana News AND Telugu News

Updated Date - May 16 , 2024 | 06:57 PM