Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Oct 21 , 2024 | 08:10 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

   Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-10-21T21:53:00+05:30

    ఢిల్లీ: గ్రూప్-1 పరీక్ష పై సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాలు

    • నవంబర్ 20 కల్లా గ్రూప్ 1 పరీక్ష పై దాఖలైన పిటిషన్లను విచారించాలని తెలంగాణ హై కోర్టుకు ఆదేశం

    • గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు విడుదలకు ముందే కేసు చేపట్టాలని హైకోర్టు సూచన

    • గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలు తుది తీర్పుకు లోబడే ఉంటాయని హైకోర్టు స్పష్టీకరణ

    • హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకున్నాం

    • గ్రూప్ వన్ విద్యార్థుల అప్లికేషన్‌లో జోక్యం చేసుకోవడం లేదు: సుప్రీం కోర్టు

    • నవంబర్ 20వ తేదీన హైకోర్టులో తదుపరి విచారణ

    • గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలు వెలువడక ముందే నవంబర్ 20 కల్లా హైకోర్టు కేసు విచారణ చేపట్టాలి

  • 2024-10-21T16:35:48+05:30

    పవన్ కల్యాణ్‍కు సిటీ సివిల్ కోర్టు సమన్లు

    • హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కోర్టు సమన్లు

    • జనవరిలో అయోధ్యకు పంపిన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్టు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

    • పవన్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీశాయని న్యాయవాది ఇమ్మనేని రామారావు పిటిషన్, విచారణకు స్వీకరించిన కోర్టు

    • తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు పదార్థాలు కలిశాయని పవన్ కల్యాణ్ ఆరోపణలు

    • ఆరోపణలకు సంబధించి నోటీసులు జారీ చేసిన సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి వై రేణుక

    • నవంబర్ 22వ తేదీన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని పవన్ కల్యాణ్, తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి కోర్టు సమన్లు

    • తిరుమల లడ్డూ వివాదం గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా, వెబ్‍సైట్లు, యూట్యూబ్ చానెళ్ల నుంచి

    • తొలగించేలా ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరిన పిటిషనర్

  • 2024-10-21T15:49:19+05:30

    కోనసీమ జిల్లాలో ఘరానా మోసం

    • నిరుద్యోగులను ఇజ్రాయిల్ పంపుతామని రూ.1.50 కోట్లు వసూల్

    • లక్షల్లో సంపాదన వచ్చేలా చేస్తానని 31 మందిని మోసం

    • విశ్వాసుల ప్రార్ధన మందిరం పేరుతో సంఘం నడుపుతూ డబ్బు వసూల్ చేసిన పాస్టర్

    • బాధితులంతా అమలాపురం, అల్లవరం, రాజోలు, గన్నవరం, ఒంగోలుకు చెందినవారే

    • డబ్బులు లేదంటే ఉద్యోగం అడిగితే చంపేస్తామని బెదిరింపులు.. ఆ తర్వాత పరారైన పాస్టర్

    • పాస్టర్ పరారవడంతో జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు

  • 2024-10-21T14:02:27+05:30

    గ్రూప్-1 పరీక్ష ప్రారంభం..

    • తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-1 పరీక్ష ప్రారంభం

    • బేగంపేటలోని ఓ పరీక్షా కేంద్రంలో గోడ దూకి లోపలకి వెళ్లిన గ్రూప్-1 అభ్యర్థి

    • అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • 2024-10-21T13:50:01+05:30

    తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..

    • తిరుమల మాడ వీధుల్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్స్

    • బాధతో తిరుమల మాడ వీధుల్లో మాట్లాడుతున్నాను.

    • తిరుమల దర్శనానికి తెలంగాణ లెటర్ లు అనుమతి ఇవ్వకపోవడం బాధాకరం

    • డయల్ యువర్ ఈవోలో తెలంగాణ లెటర్లు అనుమతించబోమన్నారు.

    • విభజన సమయంలో చంద్రబాబు రెండు ప్రాంతాలు రెండు కళ్లు అన్నారు

    • చంద్రబాబు తెలంగాణ ఒక కన్ను ఆంధ్రా ఇంకో కన్ను అని మాట్లాడారు

    • చంద్రబాబు ఒక కన్ను తీసేసుకున్నారా

    • తెలంగాణలో యాదగిరిగుట్ట, భద్రాచలంలో ఏపీ నాయకులు ఇచ్చే లెటర్స్‌కు దర్శనాలు కల్పిస్తున్నాం

    • తెలంగాణ విషయంలో ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు

    • సొంత మనుషులు, పార్టీ కార్యకర్తలు తిరుపతిలో రూమ్ ఇప్పించమని అడిగితే ఇవ్వాలని పరిస్థితి నెలకొంది.

    • ఏపీలో వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉంటే టీడీపీ వాళ్లు, టీడీపీ ప్రభుత్వం ఉంటే వైసీపీ వాళ్లు హైదరాబాద్‌లో ఆశ్రయం పొందుతారు

    • ఏపీ వాళ్ళు హైదరాబాద్‌లో బిజినెస్ చేసుకున్నా ఏనాడు ఒక మాట అనలేదు.

    • ఎమ్మెల్యేలమంతా ఏపీ వాళ్ళని రాష్ట్రానికి రావొద్దని తీర్మానం చేసుకుంటే బాధ మీకు తెలుస్తుంది.

    • తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్లు అనుమతించకపోతే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలతో భాధ పడాల్సివస్తుంది.

  • 2024-10-21T13:05:20+05:30

    గ్రూప్-1 మెయిన్స్‌పై సుప్రీం తీర్పు

    • గ్రూప్-1 మెయిన్స్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

    • పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీం

    • పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం

    • పరీక్ష వాయిదాకు సుప్రీం నిరాకరణ

    • ప్రస్తుత దశలో జోక్యం చేసుకోలేమన్న కోర్టు

  • 2024-10-21T12:33:01+05:30

    హైకోర్టులో నటుడు అల్లు అర్జున్ పిటిషన్

    • హైకోర్టులో నటుడు అల్లు అర్జున్ పిటిషన్

    • ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్ వేసిన అల్లు అర్జున్

    • విచారణకు స్వీకరించిన హైకోర్టు

    • ఈ రోజు కేసులు విచారణ జాబితాలో 176వ నంబర్ గా ఉన్న అల్లు అర్జున్ పిటిషన్

  • 2024-10-21T12:24:37+05:30

    కేటీఆర్ హౌస్ అరెస్ట్

    • బీఆర్ఎస్ నేతల‌ ఇళ్ళ వద్ద పోలీసుల పహారా

    • నందినగర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం వద్ద పోలీసుల మోహరింపు

    • ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నేతల నివాసం వద్ద మోహరించిన పోలీసులు

    • కాసేపట్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు

    • గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్

    • అప్రమత్తమైన పోలీసు

  • 2024-10-21T12:21:24+05:30

    హైకోర్టులో సజ్జల పిటిషన్..

    • తనపై ప్రభుత్వం విడుదల చేసిన లుక్‌ అవుట్ నోటీసులను హైకోర్ట్‌లో సవాల్ చేసిన ప్రభుత్వ మాజీ సలహదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి

    • పిటిషన్‌పై హైకోర్ట్‌లో విచారణ

    • హైకోర్ట్ తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పినా LOC విడుదల చేయడం కోర్ట్ ధిక్కారం కిందకు వస్తుందని వాదించిన సజ్జల తరపు న్యాయవాది

    • కోర్ట్ ధిక్కారం కిందకు వస్తుందా? రాధా? అనేది బెయిల్ పై విచారణ సమయంలో నిర్ణయిస్తారని పేర్కొన్న హైకోర్ట్

    • పిటిషన్ సంబధిత బెంచ్ కు పంపేందుకు చీఫ్ జస్టిస్ ముందు ఉంచాలని రిజిస్ట్రీ నీ ఆదేశించిన హైకోర్టు

  • 2024-10-21T12:07:56+05:30

    గాంధీ ఆసుపత్రిలో దారుణం

    • హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం

    • రెండు రోజుల నుంచి మంచినీటి కొరత

    • అవస్థలు పడుతున్న రోగులు

    • రెండు రోజుల నుంచి స్నానం చేయని రోగులు సహాయకులు

    • మంచినీటి మోటారుకు మరమ్మతులు చేయించని వైనం

  • 2024-10-21T12:02:54+05:30

    ముగిసిన పోలీస్ కస్టడీ

    • ముగిసిన మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీస్ కస్టడీ

    • తుళ్లూరు మండలం వెలగపూడి కి చెందిన మరియమ్మ హత్య కేసులో కస్టడీ విచారణ

    • నందిగం సురేషష్‌ను రెండు రోజుల పాటు విచారించిన తుళ్ళూరు పోలీసులు.

    • విచారణ అనంతరం నందిగం సురేష్‌ను కోర్టుకు హాజరపర్చిన తుళ్లూరు పోలీసులు,

    • వచ్చే నెల నాలుగో తేదీ వరకు రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు

    • జిల్లా జైలుకు మాజీ ఎంపీ నందిగం సురేష్ తరలింపు

  • 2024-10-21T11:25:33+05:30

    తిరుమలలో హెలికాఫ్టర్ కలకలం..

    • తిరుమల..శ్రీవారి ఆలయానికి సమీపం నుంచి వెళ్లిన హెలికాప్టర్

    • గత కొంత కాలంగా..తరుచుగా తిరుమలపై నుంచి వెళ్తున్న విమానాలు..

    • ఆగమ నిబంధనలకు విరుద్దంగా హెలికాప్టర్ వెళ్లడంపై భక్తుల ఆవేదన

  • 2024-10-21T11:14:33+05:30

    సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్

    • టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో దేవినేని అవినాశ్, జోగి రమేశ్‌తో సహా మిగతా నిందితులు విచారణకు సహకరించడంలేదంటూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్

    • ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా ధర్మాసనం

    • విచారణకు సహకరించాలంటూ గతంలో నిందితులకు మధ్యంతర రక్షణ కల్పించిన సుప్రీం ధర్మాసనం

    • నిందితులు విచారణాధికారులకు సహకరించడంలేదంటూ ప్రభుత్వం తరపున పిటిషన్

    • విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని, పాస్ పోర్టులను సరెండర్ చేశామని కోర్టుకు తెలిపిన అవినాశ్, జోగి రమేశ్ తరపు న్యాయవాదులు

    • తదుపరి విచారణను డిసెంబర్ 17కి వాయిదా

  • 2024-10-21T11:04:02+05:30

    పోలీస్ అమరవీరులకు పవన్ నివాళులు

    • శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది త్యాగాలు మరువలేనివి

    • అమరులైన పోలీసులకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నాను

    • పోలీసు అమర వీరుల సంస్మరణ సందర్భంగా సిబ్బంది సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి.

    • పోలీసులు వ్యక్తిగత జీవితం కంటే తమ విధులకు ఎక్కువ సమయం కేటాయిస్తారు

    • విధి నిర్వహణలో ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు.

    • గత పాలకులు పోలీసు శాఖను తమ రాజకీయ అవసరాలకే ఎక్కువగా వినియోగించుకున్నారు.

    • ఫలితంగా ఉన్నత స్థాయి అధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకూ ఇబ్బందులు చవి చూశారు

    • ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో పోలీసు శాఖ సమర్థంగా పని చేస్తోంది

  • 2024-10-21T10:26:17+05:30

    విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్..

    • విశాఖపట్టణం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

    • ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికిన కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు

    • విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన విజయనగరం జిల్లా గార్ల గ్రామానికి పవన్ కళ్యాణ్

    • గార్ల గ్రామంలో డయేరియాతో చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

  • 2024-10-21T10:03:38+05:30

    కొండ చిలువ కలకలం

    • మంగళగిరి మండలం నవులూరులో కొండ చిలువ కలకలం .

    • రెండు రోజుల క్రితం ఉండవల్లిలో ఓ కొండ చిలువను చంపిన స్దానికులు

    • వరుసగా కొండ చిలవల సంచారంతో మంగళగిరి నియోజకవర్గ ప్రజల్లో భయాందోళన

  • 2024-10-21T09:56:29+05:30

    టీడీపీ, జనసేన వర్గాల మధ్య ఘర్షణ

    • క్రోసూరు మండలం గాదెవారిపాలెం గ్రామంలో టీడీపీ -జనసేన వర్గాల మధ్య ఘర్షణ

    • సైడ్ కాలువలు వివాదంలో ఘర్షణ పడ్డ ఇరు పార్టీల కార్యకర్తలు

    • రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడ్డ ఇరు వర్గాలు

    • ఆరుగురికి గాయాలు

    • సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

  • 2024-10-21T08:54:36+05:30

    అనకాపల్లిలో..

    • అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం

    • విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసులకు నివాళులర్పించిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ కె విజయ్ కృష్ణన్, అడిషనల్ ఎస్పీ ప్రసాద్, ఇతర పోలీస్ ఉన్నత అధికారులు

  • 2024-10-21T08:53:04+05:30

    అమరవీరులకు సీఎం నివాళులు..

    • విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్కరణ కార్యక్రమం

    • అమరవీరుల స్థూపానికి సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారక తిరుమలరావు నివాళులు

    • పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ముఖ్య మంత్రి చంద్రబాబు, హోం మంత్రి అనిత

  • 2024-10-21T08:10:43+05:30

    ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

    • నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య

    • బాచుపల్లి నారాయణ కాలేజీలో ఘటన