Share News

Borra Gnaneshwar: ముదిరాజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బొర్రా జ్ఞానేశ్వర్‌ ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - Jul 18 , 2024 | 04:23 AM

తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గమైన ముదిరాజ్‌ కులం సామాజిక, ఆర్థిక పరిస్థితులపై కాంగ్రెస్‌ పార్టీకి, సీఎం రేవంత్‌రెడ్డికి పూర్తి అవగాహన ఉందని బొర్రా జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ అన్నారు.

Borra Gnaneshwar: ముదిరాజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బొర్రా జ్ఞానేశ్వర్‌ ప్రమాణ స్వీకారం

నార్సింగ్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గమైన ముదిరాజ్‌ కులం సామాజిక, ఆర్థిక పరిస్థితులపై కాంగ్రెస్‌ పార్టీకి, సీఎం రేవంత్‌రెడ్డికి పూర్తి అవగాహన ఉందని బొర్రా జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ అన్నారు. హైదరాబాద్‌ సంక్షేమ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బొర్రా జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, శ్రీహరి ముదిరాజ్‌, టీఎమ్‌ఆర్‌ఈఎల్‌ఎస్‌ అధ్యక్షులు ఎండీ ఫాహెం ఖురేషి, యూఎ్‌ఫఐడీసీ చైర్మన్‌ చల్లా నరసింహారెడ్డి, టీఎ్‌సఎ్‌ఫసీవోఎఫ్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ముదిరాజ్‌ల సమస్యలపై సానుకూలంగా స్పందించి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి తనను మొదటి చైర్మన్‌గా నియమించినట్లు తెలిపారు. మరోవైపు.. మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా జెరిపాటి జైపాల్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jul 18 , 2024 | 04:23 AM