Share News

TS News: పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నిందితుడికి బర్త్ డే వేడుకలా.. ఏంటిది ఎస్సైగారూ..!

ABN , Publish Date - Mar 05 , 2024 | 11:48 AM

పోలీస్ స్టేషన్‌ను బర్త్ డే ఈవెంట్ కోసం వాడేశారు ఓ ఎస్సై. వాడితే వాడారు.. కానీ ఎవరికి పుట్టినరోజు వేడుక నిర్వహించారో తెలుసా? ఒక హత్య కేసు నిందితుడికి.. మర్డర్ కేసు నిందితుడికి పోలీస్ స్టేషన్‌లోనే ఎస్సై బర్త్ డే వేడుకలు నిర్వహించిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగింది. విషయం తెలుసుకున్న జనం అవాక్కవుతున్నారు

TS News: పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నిందితుడికి బర్త్ డే వేడుకలా.. ఏంటిది ఎస్సైగారూ..!

జయశంకర్ భూపాలపల్లి: పోలీస్ స్టేషన్‌ (Police Station)ను బర్త్ డే (Birth day) ఈవెంట్ కోసం వాడేశారు ఓ ఎస్సై. వాడితే వాడారు.. కానీ ఎవరికి పుట్టినరోజు వేడుక నిర్వహించారో తెలుసా? ఒక హత్య కేసు నిందితుడికి.. మర్డర్ కేసు (Murder Case) నిందితుడికి పోలీస్ స్టేషన్‌లోనే ఎస్సై బర్త్ డే వేడుకలు నిర్వహించిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగింది. విషయం తెలుసుకున్న జనం అవాక్కవుతున్నారు. మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై తీగల వేణు మాధవ్.. ఓ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న వేముల మహేందర్ గౌడ్ కు పోలీస్ స్టేషన్ లోనే జన్మదిన వేడుకలు నిర్వహించి హాట్ టాపిక్‌గా మారారు. సోషల్ మీడియాలో ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎస్సై తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Hyderabad: ‘కమలం’లో టికెట్ల లొల్లి.. అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తి

PM Modi: ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2024 | 11:48 AM