Share News

Drugs: రాడిసన్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. సెలబ్రేటీలకు ఆ పరీక్షలు..!

ABN , Publish Date - Mar 30 , 2024 | 11:24 AM

రాడిసన్ డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసు నుంచి తప్పించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుంటే.. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా రాడిసన్ హోటల్ (Radison Hotel) డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Drugs: రాడిసన్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. సెలబ్రేటీలకు ఆ పరీక్షలు..!
Drugs Case

రాడిసన్ డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసు నుంచి తప్పించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుంటే.. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా రాడిసన్ హోటల్ (Radison Hotel) డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీకి వెళ్లిన వారిలో డ్రగ్స్‌ను గుర్తించేందుకు క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహిం చేందుకు పోలీసుల ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం కూకట్‌పల్లి కోర్టును పోలీసులు అనుమతి కోరారు. న్యాయస్థానం అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులు హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు.

PTC: వార్ని.. ఇక మామూలు ఇళ్ల పరిస్థితి ఏంటో.. పోలీసు శిక్షణ కళాశాలలో చోరీ !

డ్రగ్స్ కేసులో నిందితులను గుర్తించేందుకు కొంతమందికి క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలని హైకోర్టును కోరుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో నిందితులుగా మొత్తం 14 మందిని గుర్తించారు. వీరిలో ముగ్గురు మాత్రమే డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ అయింది. కొంతమంది సెలబ్రెటీస్ సమయం తీసుకుని విచారణకు రావడంతో.. వారి నమూనాల్లో డ్రగ్స్ ఆనవాలు కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. వారి శరీరాల్లో డ్రగ్స్ గుర్తించేందుకు క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి క్రోమోటోగ్రఫీ పరీక్ష చేయనట్లు తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే..

గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్‌ తీసుకున్న కొందరు యువకులను ఫిబ్రవరి 26వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. రాడిసన్ హోటల్‌లో సదరు యువకులు గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. వారిలో ఒక ప్రముఖ బీజేపీ (BJP) నేత కుమారుడితో పాటు వ్యాపారవేత్త కుమారుడు, మరికొంతమంది సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు రాడిసన్ హోటల్‌పై దాడి చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మరికొంతమంది సినీ రంగానికి చెందిన ప్రముఖులకు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.

Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. పోలీసుల అప్రమత్తం, అనేక జిల్లాల్లో 144 సెక్షన్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 30 , 2024 | 12:30 PM