Share News

Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి ఇంట విషాదం..

ABN , Publish Date - Feb 13 , 2024 | 10:25 AM

డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు వెంకటేశ్వర్లు(73) నేడు అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో వెంకటేశ్వర్లు బాధపడుతున్నారు. ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు

Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి ఇంట విషాదం..

హైదరాబాద్: డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు వెంకటేశ్వర్లు(73) నేడు అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో వెంకటేశ్వర్లు బాధపడుతున్నారు. ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కొద్ది రోజులుగా వెంకటేశ్వర్లు ఏఐజీలోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు వైరాకు తరలించారు. విషయం తెలుసుకున్న భట్టి సైతం హుటాహుటిన వైరాకు బయలుదేరి వెళ్లారు. నిజానికి నేడు భట్టి.. సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. సోదరుడి మరణ వార్త తెలియడంతో ఆయన వెంటనే స్వగ్రామమైన ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురానికి బయలుదేరి వెళ్లారు.

Updated Date - Feb 13 , 2024 | 10:25 AM