Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Bhadradri: భద్రాద్రి రామాలయ ఏఈవోపై విచారణ

ABN , Publish Date - Mar 02 , 2024 | 06:24 PM

అవినీతి ఆరోపణలపై భద్రాద్రి రామాలయ (Bhadradri Sri Rama Temple) ఏఈవో శ్రావణ్ కుమార్‌పై విచారణ చేపట్టారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వసతి గదుల నిర్మాణం అనుమతుల కోసం తమ వద్ద నుండి దేవస్థానానికి చెందిన ఏఈవో రూ.17లక్షలు తీసుకున్నారంటూ ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ...

Bhadradri: భద్రాద్రి రామాలయ ఏఈవోపై విచారణ

భద్రాద్రి కొత్తగూడెం: అవినీతి ఆరోపణలపై భద్రాద్రి రామాలయ (Bhadradri Sri Rama Temple) ఏఈవో శ్రావణ్ కుమార్‌పై విచారణ చేపట్టారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వసతి గదుల నిర్మాణం అనుమతుల కోసం తమ వద్ద నుండి దేవస్థానానికి చెందిన ఏఈవో రూ.17లక్షలు తీసుకున్నారంటూ ఇటీవల ఆరోపణలు వచ్చాయి.

ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన ట్రస్ట్ సభ్యులు.. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషర్‌కు, దేవస్థానం ఈవోకు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నివేదికలు పంపాలంటూ దేవస్థానం అధికారులను.. జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. దీంతో ఆలయ ఈవో రమాదేవి.. అంతర్గత విచారణ ప్రారంభించారు. అనంతరం నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. దాతల నుండి డబ్బు తీసుకునే ఆరోపణలపై ఏఈవో శ్రావణ్ కుమార్‌ని వివరణ కోరుతూ దేవస్థానం ఈఓ రమాదేవి మెమో జారీ చేశారు.

Updated Date - Mar 02 , 2024 | 06:24 PM