Share News

Bhadrachalam: కళ్యాణ వేడుకలకు ముస్తాబవుతున్న భద్రాద్రి రామయ్య.. నేడు అంకురార్పణ..

ABN , Publish Date - Mar 24 , 2024 | 09:39 AM

శ్రీరామనవమి పర్వదినం సమీపిస్తున్న తరుణంలో ఉత్సవాలకు భద్రాద్రి ( Bhadrachalam ) రామయ్య సిద్ధమవుతున్నాడు. నేడు సీతారాముల కళ్యాణ పనులకు అంకురార్పణ జరగనుంది.

Bhadrachalam: కళ్యాణ వేడుకలకు ముస్తాబవుతున్న భద్రాద్రి రామయ్య.. నేడు అంకురార్పణ..

శ్రీరామనవమి పర్వదినం సమీపిస్తున్న తరుణంలో ఉత్సవాలకు భద్రాద్రి ( Bhadrachalam ) రామయ్య సిద్ధమవుతున్నాడు. నేడు సీతారాముల కళ్యాణ పనులకు అంకురార్పణ జరగనుంది. రేపు డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రేపు జరగబోయే నిత్య కళ్యాణాలు రద్దు చేశారు. ఏప్రిల్ 17 న అర్చకులు సీతారాముల కళ్యాణం జరిపించి 18 న పట్టాభిషేకం చేస్తారు. కాగా.. ఏటా శ్రీరామనవమికి కొద్ది రోజుల ముందు కళ్యాణ తలంబ్రాలను కలపడం ఆనవాయితీ. ఈ ఏడాది ఈ కార్యక్రమానికి మరో విశిష్టత ఉంది.

రామాయణం ప్రకారం సీతాదేవి శోభకృత్‌ ఫాల్గుణ పౌర్ణమి ఉత్తర నక్షత్రంలో జన్మించారని పండితులు చెబుతున్నారు. ఏ ఏడాది నడుస్తున్నది కూడా శోభకృత్‌ నామ సంవత్సరం కావడం విశేషం. అమ్మవారి పుట్టిన రోజున తలంబ్రాలను కలపడం వల్ల అందరిపై అమ్మవారి చల్లని చూపు ఉంటుందని భక్తులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 24 , 2024 | 09:44 AM