Share News

Revanth Govt: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. తెల్ల రేషన్ కార్డులపై ఫైనల్‌గా ఇలా..!

ABN , Publish Date - Mar 12 , 2024 | 06:12 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన మంగళవారం నాడు క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు సీఎం రేవంత్, మంత్రులు అమోదం తెలిపారు. ఈ భేటికి సంబంధించిన వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి , శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మీడియాకు తెలిపారు.

Revanth Govt: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. తెల్ల రేషన్ కార్డులపై ఫైనల్‌గా ఇలా..!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన మంగళవారం నాడు క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు సీఎం రేవంత్, మంత్రులు అమోదం తెలిపారు. ఈ భేటికి సంబంధించిన వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి , శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మీడియాకు తెలిపారు.

కీలక నిర్ణయాలివే...

► ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు

► పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు

► మొదటి విడతలో 22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇండ్లు

► తెల్ల రేషన్ కార్డులకు అమోదం

► కొత్తగా 14 బీసీ కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు

► మహిళ సంఘాలు చేసిన వస్తువుల బ్రాండింగ్ కోసం ORR చుట్టూ 30 ఎకరాల స్థలం

► గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ అవకతవకలపై విచారణ కోసం జస్టిస్ పినాకిని చంద్ర ఘోష్‌తో కమిటీ

► వంద రోజుల్లో ఇరిగేషన్‌పై విచారణ జరిపించాలని క్యాబినెట్‌లో నిర్ణయం.

16 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు

ముదిరాజ్, యాదవ కుర్మ, లింగాయత్, పద్మశాలి, పెరక, బలిజ, రెడ్డి, వైశ్య, మాదిగ, మాదిగ ఉపకులాల, మాల, మాల ఉపకులాలు, ఏకలవ్య, బంజారా, ఆదివాసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు

గీత కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు

2008 డీఏస్సీ అభ్యర్థులకు మినిమం పే స్కేల్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయం.

వేసవిలో తాగునీటి కోసం ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

► మహిళా సాధికారత కోసం 15 అంశాలతో ప్రత్యేక కార్యక్రమం కోసం క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తెలిపారు.

కేబినెట్ భేటీ అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో ఏమన్నారంటే..

‘‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులందరం ఒక టీమ్‌గా పని చేస్తున్నాం.

మేము ఎన్నికల కోసం నిర్ణయాలు తీసుకోవడం లేదు.

ప్రజల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాం.

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే చెప్పినవి చేస్తున్నాం.

బావబామ్మర్దులు(కేటీఆర్, హరీశ్‌రావులని ఉద్దేశించి) జాగ్రత్తగా మాట్లాడాలి.

ఇకనైనా బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్ష పాత్ర పోషించాలి.

గులాబీ నేతలు రోజూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకోం.

వారు మాట్లాడకపోతే మేము ఆర్థిక క్రమశిక్షణతో ఉంటాం.

మాజీ సీఎం కేసీఆర్ లక్ష అబద్ధాలు చెప్పాడు’’ అని మంత్రి కోమటి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

TS Politics: యాదగిరిగుట్టలో కింద కూర్చోవడానికి కారణమిదే: భట్టి విక్రమార్క

Kishan Reddy: పార్లమెంట్ ఎన్నికలపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2024 | 06:41 PM