Share News

Siddipet: నర్సాయపల్లిలో పురాతన వెండి నాణేలు ..

ABN , Publish Date - May 31 , 2024 | 05:03 AM

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లిలో హైదరాబాద్‌ రాష్ట్రాన్ని పాలించిన అసఫ్‌ జాహీ కాలం (17వ శతాబ్దం) నాటి వెండి నాణేలు లభ్యమయ్యాయి. గ్రామానికి చెందిన చల్ల మల్లారెడ్డి భూమిలో గురువారం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి పనుల్లో

Siddipet: నర్సాయపల్లిలో పురాతన వెండి నాణేలు ..

  • అసఫ్‌ జాహీ కాలం నాటివిగా గుర్తింపు

మద్దూరు, మే 30 : సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లిలో హైదరాబాద్‌ రాష్ట్రాన్ని పాలించిన అసఫ్‌ జాహీ కాలం (17వ శతాబ్దం) నాటి వెండి నాణేలు లభ్యమయ్యాయి. గ్రామానికి చెందిన చల్ల మల్లారెడ్డి భూమిలో గురువారం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి పనుల్లో భాగంగా కూలీలు వరం గట్టు తవ్వుతుండగా 238 గ్రాముల 20 వెండి నాణాలు, 2ఉంగరాలు లభ్యమయ్యా యి. ఆర్కియాలజీ డిపార్డుమెంట్‌కు ఈ నాణేల ఫొటో తీసి పంపించగా అసఫ్‌ జాహీ కాలం నాటి నాణేలుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - May 31 , 2024 | 07:44 AM