నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
ABN , Publish Date - Nov 26 , 2024 | 10:22 PM
ప్రజల మద్దతుతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. తాళ్లగురిజాలలో రూ.5 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్‌జిమ్ ప్రారం భించి మాట్లాడారు. క్రీడాకారులు, యువకులు కోరిక మేరకు ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కన్నెపల్లి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంగళవారం జన్కాపూర్‌లో రూ.3.50 లక్ష లతో నిర్మించనున్న సీసీ రోడ్ డ్రైన్ నిర్మాణ పనులను, టేకులపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించే పంచాయతీ భవన నిర్మాణానికి, కన్నెపల్లిలలో రూ.12 లక్షలతో నిర్మించే అం గన్‌వాడీ భవనానికి, వీగాంలో రూ. 5 లక్షలతో నిర్మించే సీసీ రోడ్, డ్రైనేజీ పనులను ప్రారం భించారు. కన్నెపల్లి రైతువేదికలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నాయకులు మాధవరపు నర్సింగరావు, మండల అధ్యక్షుడు రామాంజనేయులు, భీమిని మండల అధ్య క్షుడు లక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ రాకేష్ శర్మ, పాల్గొన్నారు.
బెల్లంపల్లిరూరల్, (ఆంధ్రజ్యోతి): ప్రజల మద్దతుతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. తాళ్లగురిజాలలో రూ.5 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్‌జిమ్ ప్రారం భించి మాట్లాడారు. క్రీడాకారులు, యువకులు కోరిక మేరకు ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాత బెల్లంపల్లిలో రూ.50 లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు చేశారు. ఎంపీడీవో మహేందర్, కాంగ్రెస్ నాయకులు కారుకూరి రాంచందర్, హరికృష్ణ, సింగతి సత్యనారాయణ, సుధాకర్, సురేష్, భూమన్న, స్వామి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే
బెల్లంపల్లిరూరల్, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థాయి సాప్ట్‌బాల్ పోటీల్లో బ్రాంజ్‌మెడల్ సాధించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ విద్యార్థులు శశివరుణ్, వంశీ, హర్షవర్దన్, రవి చంద్రు, సాత్విక్‌లను, సిల్వర్ మెడల్ సాధిం చిన వికాస్, హృతిక్ తేజను మంగళవారం పాఠశాలలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ అభినం దించారు. మరిన్ని పతకాలు సాధించి జాతీ య, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించాలని సూచించారు. వ్యాయామ ఉపాధ్యాయులు వామన్, పీడీ, రాజశేఖర్, పాల్గొన్నారు.