Share News

ప్రారంభమైన జాతీయస్థాయి సాఫ్ట్‌ బేస్‌బాల్‌ పోటీలు

ABN , Publish Date - Dec 24 , 2024 | 10:49 PM

బెల్లంపల్లి పట్టణంలో జాతీయ స్థాయి సాఫ్ట్‌ బేస్‌బాల్‌ పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని తిలక్‌ క్రీడా మైదానంలో 9వ సాఫ్ట్‌ బేస్‌బాల్‌ సబ్‌ జూనియర్‌ యూత్‌ అండ్‌ గర్ల్స్‌ నేషనల్‌ చాంపియన్‌ పోటీలను ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ ప్రారంభించారు.

ప్రారంభమైన   జాతీయస్థాయి సాఫ్ట్‌ బేస్‌బాల్‌ పోటీలు

బెల్లంపల్లి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : బెల్లంపల్లి పట్టణంలో జాతీయ స్థాయి సాఫ్ట్‌ బేస్‌బాల్‌ పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని తిలక్‌ క్రీడా మైదానంలో 9వ సాఫ్ట్‌ బేస్‌బాల్‌ సబ్‌ జూనియర్‌ యూత్‌ అండ్‌ గర్ల్స్‌ నేషనల్‌ చాంపియన్‌ పోటీలను ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పోటీలను ఇక్కడ నిర్వహించడం సంతోషకరమన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలన్నారు. క్రీడలు శారీరక ఉల్లాసంతోపాటు ఉద్యోగ సాధనకు దోహదపడతాయన్నారు. క్రీడాకారులు మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించారు. అనంతరం తెలంగాణ సాఫ్ట్‌ బేస్‌ బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్‌ మాట్లాడుతూ బెల్లంపల్లిలో జాతీయ స్థాయి సాప్ట్‌బేస్‌ పోటీలు నిర్వహణకు సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. పోటీలు ఈ నెల 27న ముగుస్తాయన్నారు. తిలక్‌ మైదానం అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేయాలని పేర్కొన్నారు. స్పందించిన ఎమ్మెల్యే మైదానం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడను ఆడారు. పోటీలకు తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, హర్యానా, రాజస్ధాన్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. సాఫ్ట్‌ బేస్‌బాల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురువేందర్‌, ట్రెజరర్‌ దినాకర్‌, జిల్లా త్రోబాల్‌ సెక్రెటరీ యాదండ్ల బలరాం, ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యులు ఐలయ్య, రాజం, శ్రావణ్‌, పీఈటీలు రాజ్‌ మహ్మద్‌, పీడీలు పద్మ, శిరీష సీనియర్‌క్రీడాకారులు యాదండ్ల నర్సయ్య, గోలేటి రాజేష్‌, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 10:49 PM