Share News

సూపాకలో మారమ్మ జాతర

ABN , Publish Date - Dec 20 , 2024 | 10:39 PM

మండలంలోని సూపాక గ్రామంలో శుక్రవారం మారమ్మ జాతర ప్రారంభమైంది. మారమ్మ, లక్ష్మీదేవి విగ్రహాలను గ్రామస్థులు పల్లకిలో చెన్నూరు గోదావరి నదికి కాలినడకన చేరు కున్నారు.

సూపాకలో మారమ్మ జాతర

కోటపల్లి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని సూపాక గ్రామంలో శుక్రవారం మారమ్మ జాతర ప్రారంభమైంది. మారమ్మ, లక్ష్మీదేవి విగ్రహాలను గ్రామస్థులు పల్లకిలో చెన్నూరు గోదావరి నదికి కాలినడకన చేరు కున్నారు. అనంతరం ఉత్తరవాహిని గోదావరి నదిలో అమ్మవారి విగ్రహాలకు పుణ్యస్నానాలు చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనం తరం గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. శనివారం అమ్మవారికి బోనాల సమర్పణ ఉం టుందని పేర్కొన్నారు. మాజీ సర్పంచు కాశెట్టి సతీష్‌కుమార్‌, యూత్‌ అధ్యక్షుడు కొడిశెట్టి రాజు, గట్టు పురుషోత్తం, మహేష్‌, సాయి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 10:39 PM