Share News

Maheshwar Reddy: ఇంద్రకరణ్ రెడ్డి ఆ భూమి పట్టాలు ఎలా ఇచ్చారు

ABN , Publish Date - Mar 01 , 2024 | 10:48 PM

జిల్లాలో గత పాలకులు ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి(Maheshwar Reddy) అన్నారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ భూమిలోనే ప్రైవేట్ సంస్థ డీ మార్ట్ నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు.

Maheshwar Reddy: ఇంద్రకరణ్ రెడ్డి ఆ భూమి పట్టాలు ఎలా ఇచ్చారు

నిర్మల్: జిల్లాలో గత పాలకులు ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి(Maheshwar Reddy) అన్నారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ భూమిలోనే ప్రైవేట్ సంస్థ డీ మార్ట్ నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు. నిర్మల్ చుట్టుపక్కల గ్రామాల్లో డీ1 పట్టాల పేరుతో దోపిడి చేశారని మండిపడ్డారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హయాంలో 350 అక్రమ పట్టాలు ఇచ్చారన్నారు. గతంలో డీ1 పట్టాలు కేవలం 200 మాత్రమే ఉన్నాయన్నారు.

నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 3వేల ఎకరాల భూమిని బడా నేతలు కాజేశారని ధ్వజమెత్తారు. గతంలో చెప్పినట్లే ప్రభుత్వ భూములు కాపాడి పేదలకు ఇస్తామని స్పష్టం చేశారు. భూముల దందాలో ఎంతటివారున్న చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలయాల భూముల పరిరక్షణ కోసం రాష్ట్ర వాప్తంగా ఆందోళన చేస్తామని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.

Updated Date - Mar 01 , 2024 | 10:48 PM