Share News

రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలన

ABN , Publish Date - Dec 22 , 2024 | 10:22 PM

ఇందారం బస్టాండ్‌ వద్ద శుక్రవారం రాత్రి బైక్‌ ఢీకొని సుంకరి మల్లయ్య అనే రిటైర్డు కార్మికుడు మృతిచెందగా ఆదివారం ప్రమాదం జరిగిన స్థలాన్ని సీఐ వేణుచందర్‌ పరిశీలించారు. సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశారని కానీ కనెక్షన్‌ ఇవ్వ కపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.

రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలన

జైపూర్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఇందారం బస్టాండ్‌ వద్ద శుక్రవారం రాత్రి బైక్‌ ఢీకొని సుంకరి మల్లయ్య అనే రిటైర్డు కార్మికుడు మృతిచెందగా ఆదివారం ప్రమాదం జరిగిన స్థలాన్ని సీఐ వేణుచందర్‌ పరిశీలించారు. సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశారని కానీ కనెక్షన్‌ ఇవ్వ కపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.

పశువులు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. లైటింగ్‌తో పాటు స్పీడు బ్రేకర్లను వేయించాలన్నారు. సీఐ హెచ్‌కేఆర్‌ రోడ్‌వేస్‌ మేనేజర్‌ రామకృష్ణతో మాట్లాడారు. వారం రోజుల్లో సెంట్రల్‌ లైటింగ్‌కు విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చి లైట్‌లు వెలిగేలా చేయకపోతే కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. సర్వీసు రోడ్డు సైడ్‌ రేయిల్స్‌ కూడా బాగు చేయాలని సూచించారు. సీఐ వెంట ఎస్‌ఐలు శ్రీధర్‌, నాగరాజు తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 10:22 PM