Share News

Narsa Reddy: మాజీ పీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి మృతి

ABN , Publish Date - Jan 29 , 2024 | 09:10 AM

నిర్మల్: మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత న‌ర్సారెడ్డి క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి ప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు సంతాపం ప్రకటిస్తూ..

 Narsa Reddy: మాజీ పీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి మృతి

నిర్మల్: మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత న‌ర్సారెడ్డి క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి ప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు సంతాపం ప్రకటిస్తూ.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

1972 నుంచి రెండేళ్ల పాటు నర్సారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పని చేసారు. ఎంపీగా, ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీ గా పని చేసారు. జలగం వెంగళరావు మంత్రి వర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేసిన నర్సారెడ్డి.. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో మంత్రుల నివాస సముదాయానికి దగ్గర్లో ఉన్న వైట్ హౌస్‌లో నివాసం ఉంటున్నారు.

నర్సా రెడ్డి భారత స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం పాలన నుంచి హైదరాబాద్‌ను విముక్తి కోసం పోరాటంలో పాల్గొన్నారు. 1940 ప్రారంభం నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఎంపీ కావడానికి ముందు అతను వరుసగా మూడు సార్లు శాసనసభ సభ్యుడిగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్నారు. 1971లో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు.

Updated Date - Jan 29 , 2024 | 09:10 AM