నేషనల్ హైవే పనులను అడ్డుకోవద్దు
ABN , Publish Date - Nov 26 , 2024 | 10:25 PM
నేషనల్ హైవే పనులను ఎవరూ అడ్డుకోవద్దని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం కిష్టాపూర్‌లో జరుగుతున్న హైవే పనులను ఆయన పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ హైవే కింద భూములు కోల్పోయి మొదటి విడత పరిహారం పొందిన రైతులకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు పెరిగిన నష్టపరిహారం కూడా అందుతుందని పేర్కొన్నారు.
జైపూర్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : నేషనల్ హైవే పనులను ఎవరూ అడ్డుకోవద్దని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం కిష్టాపూర్‌లో జరుగుతున్న హైవే పనులను ఆయన పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ హైవే కింద భూములు కోల్పోయి మొదటి విడత పరిహారం పొందిన రైతులకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు పెరిగిన నష్టపరిహారం కూడా అందుతుందని పేర్కొన్నారు. ఇంకా భూనిర్వాసితులు ఎవరైనా రెవెన్యూ రికార్డుల్లో తప్పులు ఉంటే తహసీల్దార్‌ను సంప్రదించాలన్నారు.
అనంతరం కుందారం, నర్సింగాపూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు టార్పాలిన్‌లు, గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రానికి నాణ్యమైన ధాన్యం తీసుకురావాలన్నారు. దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ వనజారెడ్డి, నేషనల్ హైవే అధికారి కృష్ణరెడ్డి, ఎన్‌హెచ్ కాంట్రాక్టర్ ప్రసాదరావు, ఆర్‌ఐ తిరుపతి ఉన్నారు.