Share News

Accident: ఆటో టైరు కింద నలిగి చిన్నారి మృతి

ABN , Publish Date - Dec 30 , 2024 | 05:00 AM

బోసి నవ్వులు.. చిట్టిపొట్టి మాటలతో అప్పటి దాకా అమ్మానాన్నలతో గడిపిన 11 నెలల చిన్నారి కానరాని లోకాలకు తరలిపోయి వారికి తీరని శోకాన్ని మిగిల్చింది.

Accident: ఆటో టైరు కింద నలిగి చిన్నారి మృతి

  • రంగారెడ్డి జిల్లా పడకల్‌ గ్రామంలో ఘటన

తలకొండపల్లి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): బోసి నవ్వులు.. చిట్టిపొట్టి మాటలతో అప్పటి దాకా అమ్మానాన్నలతో గడిపిన 11 నెలల చిన్నారి కానరాని లోకాలకు తరలిపోయి వారికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఆడుకుంటూ ఆటో కిందకు వెళ్లిన పాపను గమనించని డైవర్‌ ముందుకు కదిలించడంతో టైరు కింద నలిగి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్‌ గ్రామంలో ఆదివారం జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన పుష్పరాజ్‌ యాదవాసి కుటుంబంతో కలిసి కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం పడకల్‌కు వచ్చాడు.


గ్రామానికి చెందిన ఓ రైతు డెయిరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పాల డబ్బాలను ఆటోలో లోడ్‌ చేస్తుండగా.. పుష్పరాజ్‌ 11 నెలల కూతురు ప్రియాన్సి ఆడుకుంటూ ఆటో కిందకు వెళ్లింది. గమనించని డ్రైవర్‌ ఆటోను ముందుకు కదిలించడంతో చిన్నారి టైరు కింద పడి తీవ్రంగా గాయపడింది. కడ్తాల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వైద్యులు చిన్నారిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పుష్పరాజ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 30 , 2024 | 05:00 AM