Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Meta: ఒక్క నెలలో 67 లక్షల వాట్సప్ అకౌంట్లు క్లోజ్.. మెటా సంచలనం

ABN , Publish Date - Mar 03 , 2024 | 04:11 PM

మెటా(Meta) తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒక్క నెలలోనే 67 లక్షల వాట్సప్(WhatsApp) అకౌంట్లను మెటా నిషేధించింది. దేశంలో 500 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లు కలిగిన మెటా అత్యంత ప్రజాదరణ కలిగిన మెసేజింగ్ ప్లాట్‌ఫాంగా పేరుపొందింది.

Meta: ఒక్క నెలలో 67 లక్షల వాట్సప్ అకౌంట్లు క్లోజ్.. మెటా సంచలనం

ఢిల్లీ: మెటా(Meta) తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒక్క నెలలోనే 67 లక్షల వాట్సప్(WhatsApp) అకౌంట్లను మెటా నిషేధించింది. దేశంలో 500 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లు కలిగిన మెటా అత్యంత ప్రజాదరణ కలిగిన మెసేజింగ్ ప్లాట్‌ఫాంగా పేరుపొందింది. అయితే 2021 ఐటీ రూల్స్‌ని పాటించలేదనే కారణంతో వాట్సప్ అకౌంట్లను తొలగించాలని మెటా నిర్ణయించింది. ఇందులో భాగంగా జనవరి 1 నుంచి 31 వరకు 67 లక్షలకుపైగా అకౌంట్లను నిషేధించింది.

వీటిలో 13 లక్షల అకౌంట్ యూజర్లకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తొలగించింది. నిషేధం తరువాత అదే నెలలో మెటా 14,828 ఫిర్యాదులను అందుకుంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా అకౌంట్లు తొలగించారనే కారణంతో వచ్చిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. వాట్సప్‌ని దుర్వినియోగం చేసే అకౌంట్లను నిషేధించినట్లు ఆ సంస్థ చెబుతోంది. భారత్ సోషల్ మీడియా వినియోగదారులకు సాధికారత కల్పించే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ(GAC)ని ప్రారంభించింది. ఇది కంటెంట్, ఇతర సమస్యలకు సంబంధించి వినియోగదారుల సమస్యలను పరిశీలిస్తుంది.


కొత్తగా ఏర్పాటైన ప్యానెల్, బిగ్ టెక్ కంపెనీల సాయంతో దేశంలోని డిజిటల్ చట్టాలను పటిష్టం చేసేందుకు యూజర్ల ఫిర్యాదులను పరిశీలిస్తుంది. WhatsApp తన అధికారిక ప్రకటనలో.. "వాట్సప్‌ దుర్వినియోగాన్ని నిరోధించడం, ఎదుర్కోవడానికి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సేవలని అందిస్తోంది. భద్రతా ఫీచర్‌లు, నియంత్రణల కోసం.. ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, విశ్లేషకుల బృందం పని చేస్తోంది. భద్రతాపరమైన కారణాల రీత్యా లక్షల సంఖ్యలో అకౌంట్లను నిషేధించాం" అని పేర్కొంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 03 , 2024 | 04:12 PM