Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Byjus: చేతులెత్తేసిన బైజూస్.. జీతాలివ్వలేమని తెగేసి చెప్పిన సీఈవో.. షాక్‌లో ఉద్యోగులు

ABN , Publish Date - Mar 03 , 2024 | 02:28 PM

తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బైజూస్(Byjus) విషయంలో అనుకున్నదే జరిగింది. కంపెనీ సీఈవో సంస్థ ఉద్యోగులకు ఆదివారం ఒక మెయిల్ పంపారు. ఉద్యోగులకు జీతాలివ్వలేమని అందులో పేర్కొన్నారు.

Byjus: చేతులెత్తేసిన బైజూస్.. జీతాలివ్వలేమని తెగేసి చెప్పిన సీఈవో.. షాక్‌లో ఉద్యోగులు

ఢిల్లీ: తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బైజూస్(Byjus) విషయంలో అనుకున్నదే జరిగింది. కంపెనీ సీఈవో సంస్థ ఉద్యోగులకు ఆదివారం ఒక మెయిల్ పంపారు. ఉద్యోగులకు జీతాలివ్వలేమని అందులో పేర్కొన్నారు. బైజూస్‌లో ఆర్థిక సంక్షోభం కారణంగా ఎడ్‌టెక్ సంస్థ తన ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉందని సీఈవో బైజు రవీంద్రన్(Byju Raveendran) అన్నారు.

ఆయన రాసిన లేఖలో "కంపెనీ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు. దీంతో మేం జీతాలు అందించలేకపోతున్నాం. మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం అందించడానికి సేకరించిన నిధులను సైతం వినియోగించుకోలేకపోతున్నాం. కంపెనీ నిధులను లాక్ చేశారు. కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారెందరో పదుల రెట్ల లాభాన్ని పొందారు. కానీ వారు ప్రస్తుతం అవలంబిస్తున్న విధానాల వల్ల మీకు జీతాలు చెల్లించలేకపోతున్నాం. జీతాల చెల్లింపునకు ఎన్నో ప్రయత్నాలు చేశాం. మిమ్మల్ని బాధపెడుతున్నందుకు క్షమించండి" అని ఉంది.

మార్చి 10 వరకు జీతాలు చెల్లించడానికి కృషి చేస్తామని సీఈవో తెలిపారు. ఫిబ్రవరిలో బైజూస్‌కి చెందిన ప్రాథమిక వాటాదారులు రవీంద్రన్‌ను సీఈవో పదవి నుంచి, కంపెనీ బోర్డు నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అలా బైజూస్ షేర్లు 90 శాతం మేర క్షీణించాయి. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బైజూస్ గట్టెక్కడం చాలా కష్టమని నిపుణులు అంటున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 03 , 2024 | 02:31 PM