Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Byjus: బైజుస్‌కు మరో దెబ్బ.. పెట్టుబడిని భారీగా తగ్గించిన గ్లోబల్ సంస్థ

ABN , Publish Date - Mar 03 , 2024 | 09:29 AM

ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. బైజూస్‌లో గతంలో కొన్ని వందల మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టిన సంస్థ తన పెట్టుబడిని భారీగా తగ్గించింది.

Byjus: బైజుస్‌కు మరో దెబ్బ.. పెట్టుబడిని భారీగా తగ్గించిన గ్లోబల్ సంస్థ

ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్(Byjus) పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. ఇప్పటికే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం పెట్టుబడిదారులతో ఒప్పందం వివాదం కారణంగా కష్టంగా మారిందని ఇటివల బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్(Byju Raveendran) ప్రకటించారు. మార్చి 10లోపు చెల్లిస్తామని చెప్పిన క్రమంలోనే మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. గతంలో బైజూస్‌లో పెట్టుబడి పెట్టిన ఆస్ట్రేలియాకు చెందిన గ్లోబల్ సంస్థ Macquarie Capital తన మొత్తం పెట్టుబడిని 98 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది.

స్విస్ బ్యాంక్ జూలియస్ బేర్ గ్రూప్(Julius Baer group) లేవనెత్తిన ఆందోళనల నేపథ్యంలో Macquarie Capital బైజూస్‌లో పెట్టుబడిని తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ edtech సంస్థ Macquarie Capital నుంచి 2021లో పెద్ద ఎత్తున పెట్టుబడిని పొందింది. ఇది వందల మిలియన్ల డాలర్లుగా ఉండగా ఇప్పుడు 98 శాతం విలువ తగ్గింపు అనేది బైజూస్‌కు పెద్ద భారమనే చెప్పవచ్చు. అయితే కాలం చెల్లిన వాల్యుయేషన్‌ను పేర్కొంటూ బైజూస్ వసూలు చేసిన ఫీజులను ప్రశ్నించడంతో ఈ చర్య స్విస్ బ్యాంక్ జూలియస్ బేర్ గ్రూప్ అంశాల ద్వారా వెలుగులోకి వచ్చింది.


ఈ చర్య ఇప్పుడు బైజూస్(Byjus) వాల్యుయేషన్, పెట్టుబడులపై మరింత ప్రభావం చూపనుంది. దీంతోపాటు ఫీజులు, వాల్యుయేషన్‌కు సంబంధించిన చిక్కులను కూడా కలిగి ఉండవచ్చు. దీంతో బైజూస్ భవిష్యత్తు(future) ఆర్థిక పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులకు జీతాల చెల్లింపు కష్టమేనని పలువురు అంటున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral Video: అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ కన్నీరు పెట్టుకున్న ముఖేష్ అంబానీ

Updated Date - Mar 03 , 2024 | 09:29 AM