Share News

Valentines Day Sale 2024: వాలెంటైన్స్ డే సేల్ 2024.. ఈ ప్రొడక్టులపై ఆఫర్లు అదుర్స్

ABN , Publish Date - Feb 03 , 2024 | 03:49 PM

ఫిబ్రవరి నెల అనగానే అనేక మందికి వాలెంటైన్స్ డే గుర్తుకొస్తుంది. ప్రేమికులు వారి ప్రియమైన వ్యక్తులకు ఏ గిఫ్ట్ ఇవ్వాలి, ఎలా సర్‌ప్రైజ్ చేయాలని వారం ముందు నుంచే ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం అమెజాన్‌లో పలు ఉత్పత్తులపై వాలెంటైన్స్ డే తగ్గింపు ఆఫర్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Valentines Day Sale 2024: వాలెంటైన్స్ డే సేల్ 2024.. ఈ ప్రొడక్టులపై ఆఫర్లు అదుర్స్

ఫిబ్రవరి నెల అనగానే అనేక మందికి వాలెంటైన్స్ డే గుర్తుకొస్తుంది. ప్రేమికులకు ఈ నెల చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వారి ప్రియమైన వ్యక్తులకు ఏ గిఫ్ట్ ఇవ్వాలి, ఎలా సర్‌ప్రైజ్ చేయాలని వారం ముందు నుంచే ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం అమెజాన్‌లో పలు ఉత్పత్తులపై వాలెంటైన్స్ డే తగ్గింపు ఆఫర్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మీకు నచ్చిన ప్రొడక్టును ఎంచుకుని తగ్గింపులను పొందండి.

బోట్ బాస్‌హెడ్స్ 100: దీని అసలు ధర రూ.999 ఉండగా ప్రస్తుతం 65 శాతం తగ్గింపును ప్రకటించారు. ఈ క్రమంలో రూ.349కే ఇది లభించనుంది. స్టైలిష్ బాస్‌హెడ్స్ 100 సుపీరియర్ కోటెడ్ 1.2 మీటర్ల పర్ఫెక్ట్ లెంగ్త్ కేబుల్‌తో వస్తున్నాయి. 16 ఓం స్పీకర్ రెసిస్టెన్స్‌తో శక్తివంతమైన 10mm డైనమిక్ డ్రైవర్ ఇయర్‌ఫోన్‌ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇవి ట్రాక్‌లకు పంచ్, రిథమిక్ ప్రతిస్పందనను అందించడానికి కూడా సపోర్ట్ చేస్తుంది.


JBL C100SI వైర్డ్ ఇన్ ఇయర్ హెడ్‌ఫోన్‌: వీటి అసలు ధర రూ. 1299 ఉండగా ప్రస్తుతం 54% తగ్గింపును అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది రూ.599కు అందుబాటులో ఉంటుంది. ఇవి ఒక సంవత్సరం వారంటీతో వస్తున్నాయి. కేబుల్ పొడవు: 1.2 మీటర్లు కాగా JBL సిగ్నేచర్ సౌండ్ ఫ్రీక్వెన్సీ పరిధి: 20-20kHz, డ్రైవర్ సెన్సిటివిటీ:100±3dBSPL, 1mW,గరిష్ట SPL: 5mW వంటి సౌకర్యాలు ఉన్నాయి.

Sony MDR ZX110A మైక్: ప్రముఖ కంపెనీ అయిన సోని ప్రేమికుల రోజు సందర్భంగా హెడ్‌ఫోన్‌‌లపై 35 శాతం తగ్గింపును ప్రకటించింది. వీటి అసలు ధర రూ.1390 ఉండగా..ప్రస్తుతం రూ.900లకే లభిస్తున్నాయి. ఇవి మంచి సౌండ్ కోసం 30mm డైనమిక్ డ్రైవర్ యూనిట్‍‌ను కల్గి ఉన్నాయి. వీటికి ఒక సంవత్సరం వారంటీ ఉంటుందని పేర్కొన్నారు. వీటితోపాటు అమెజాన్‌లో మరికొన్ని ఉత్పత్తులపై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై కూడా ఓ లుక్కేయండి మరి.

Updated Date - Feb 03 , 2024 | 03:49 PM