Share News

Smart Phones: దేశీయ మార్కెట్లో రియల్ మీ కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్..ఫీచర్లు చుశారా?

ABN , Publish Date - Jan 29 , 2024 | 03:57 PM

స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. రియల్ మీ నుంచి కొత్తగా Realme 12 Pro, Realme 12 Pro+ 5జీ ఫోన్లు ఈరోజు దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. అయితే ఈ ఫోన్ల ఫీచర్లు ఏంటి, ధర వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.

Smart Phones: దేశీయ మార్కెట్లో రియల్ మీ కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్..ఫీచర్లు చుశారా?

స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. రియల్ మీ నుంచి కొత్తగా Realme 12 Pro, Realme 12 Pro+ 5జీ ఫోన్లు ఈరోజు దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. అయితే ఈ ఫోన్ల ఫీచర్లు ఏంటి, ధర వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం. Realme 12 Pro Qualcomm Snapdragon ప్రాసెసర్, 6 Gen 1 చిప్‌సెట్‌తో వచ్చింది. Realme 12 Pro+ Qualcomm Snapdragon 7s Gen 2 చిప్‌సెట్‌తో అందుబాటులో ఉంది. ఇక డిస్ప్లే Realme 12 Pro సిరీస్ 6.7-అంగుళాల FHD+ కర్వ్డ్ OLED ProXDR, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశంతో లభిస్తుంది.


Realme 12 Proని రెండు వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. 8GB RAM + 128GB నిల్వ, 8GB RAM + 256GB నిల్వ. ఫోన్ 8GB వరకు డైనమిక్ RAM సపోర్టుతో వస్తుంది. Realme 12 Pro+ 8GB RAM + 128GB నిల్వ, 8GBRAM + 256GB నిల్వ, 12GBRAM + 256GB వేరియంట్‌లలో ప్రారంభించబడింది. ఈ ఫోన్ 12GB వరకు డైనమిక్ RAM మద్దతుతో వస్తుంది.

ఇక కెమెరా విషయానికి వస్తే Realme 12 Pro 50MP Sony IMX882 ప్రైమరీ కెమెరా, 32MP Sony IMX709 టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 16MP ఫ్రంట్ కెమెరాతో లభిస్తుంది. Realme 12 Pro+ 550MP Sony IMX890 ప్రైమరీ కెమెరా, 32MP OV64B పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 32 MP ఫ్రంట్ కెమెరాతో వచ్చింది. Realme 12 Pro, Realme 12 Pro+ 5000mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్‌తో లభిస్తున్నాయి.

ఇక Realme 12 Pro 5G సిరీస్ ఫోన్ ప్రారంభ ధర రూ.25999 వద్ద ప్రారంభించబడింది. ఈ ఫోన్ టాప్ వేరియంట్ రూ.26,999గా ఉంది. రియల్‌మీ 12 ప్రో ప్లస్ 5జీ ప్రారంభ ధర రూ. 29999గా ప్రకటించారు. ఈ ఫోన్ టాప్ వేరియంట్ రూ.33,999గా ఉంది. ఎర్లీ బర్డ్ సేల్‌లో Realme 12 Pro 5G సిరీస్‌ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఈ సేల్ ఈరోజు అంటే 29 జనవరి 2024 సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సేల్ 10 గంటల వరకు మాత్రమే ఉంటుంది. మీరు Realme 12 Pro 8GB/128GB వేరియంట్‌ను రూ. 23,999కి కొనుగోలు చేయగలుగుతారు. మొదటి సేల్‌లో కంపెనీ రూ.2,000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. ఈ తగ్గింపును ICICI బ్యాంక్ కార్డ్‌తో పొందవచ్చు. ఇది కాకుండా, నో కాస్ట్ EMI, రూ. 1,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు.

Updated Date - Jan 29 , 2024 | 03:57 PM