Share News

Ninja Pro Max Plus: ఆఫర్ అదుర్స్..వెయ్యికే రూ.8 వేల స్మార్ట్ వాచ్

ABN , Publish Date - Jan 06 , 2024 | 03:54 PM

ఇటివల కాలంలో స్మార్ట్‌వాచ్‌ల వినియోగం క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక సంస్థలు పోటీపడి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా Ninja Pro Max Plus 46.5mm (1.83") స్మార్ట్ వాచ్‌పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు.

Ninja Pro Max Plus: ఆఫర్ అదుర్స్..వెయ్యికే రూ.8 వేల స్మార్ట్ వాచ్

ఇటివల కాలంలో స్మార్ట్‌వాచ్‌ల వినియోగం క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక సంస్థలు పోటీపడి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా Ninja Pro Max Plus 46.5mm (1.83") స్మార్ట్ వాచ్‌పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు. దీని అసలు ధర రూ.7999 ఉండగా..ప్రస్తుతం రూ.999కే అందించనున్నట్లు తెలిపారు. ఈ రేట్ అధికారిక వైబ్‌సైట్‌లో ఉండగా..దీనిని ఫ్లిప్‌కార్టులో రూ.1,099కు సేల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ వాచ్ ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ స్మార్ట్ వాచ్ 2.5D కర్వ్డ్ గ్లాస్, 240x 284 పిక్సెల్ రిజల్యూషన్‌తో 1.83 అంగుళాల రంగు LCD ఫుల్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. దీంతోపాటు స్క్రాచ్ రెసిస్టెంట్, అల్ట్రా థిన్ 9.8mm, IP68 వాటర్ రెసిస్టెన్స్, బ్లూటూత్, ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్, స్టెప్ కౌంట్, SpO2, హార్ట్ రేట్, స్లీప్ మానిటరింగ్‌తో స్మార్ట్ హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి సంవత్సరం వారంటీ ఉండగా..దీని బ్యాటరీ రన్‌టైమ్ 8 రోజుల వరకు ఉంటుందని ప్రకటించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Indian Crew: భారత్ మాతా కీ జై అంటూ నావికాదళానికి థాంక్స్..కారణమిదే

దీంతోపాటు ఈ స్మార్ట్ వాచ్‌ను ఫిట్‌నెస్ ఫీచర్లు వర్కౌట్, టెన్నిస్, ఫుట్‌బాల్, అవుట్‌డోర్ రన్నింగ్, స్కీయింగ్, ఇండోర్ సైక్లింగ్, సైక్లింగ్, రగ్బీ, రోయింగ్ మెషిన్, ఆన్ ఫుట్, బేస్‌బాల్, ఎలిప్టికల్, డ్యాన్స్, బాస్కెట్‌బాల్, డంబెల్, ఇండోర్ రన్నింగ్, వాకింగ్, క్లైంబింగ్, ఇండోర్ వాకింగ్, గోల్ఫ్, యోగా, స్కిప్పింగ్, సిట్ అప్, రన్నింగ్, బ్యాడ్మింటన్ వంటి సమయాల్లో కూడా ఉపయోగించవచ్చని పేర్కొ్న్నారు.

Updated Date - Jan 06 , 2024 | 03:54 PM