Share News

Elon Musk: ఎలాన్ మస్క్ X నుంచి త్వరలో మరో ఫీచర్

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:13 AM

ఎలాన్ మస్క్ ఎక్స్ యాప్ (గతంలో ట్విట్టర్) నుంచి త్వరలో మరో ఫీచర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఈ సంస్థ కంటెంట్, భద్రతా నియమాలను అమలు చేయడంలో భాగంగా కొత్త "ట్రస్ట్ అండ్ సేఫ్టీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్"ని నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

Elon Musk: ఎలాన్ మస్క్ X నుంచి త్వరలో మరో ఫీచర్

ఎలాన్ మస్క్(Elon Musk) ఎక్స్ యాప్ (గతంలో ట్విట్టర్) నుంచి త్వరలో మరో ఫీచర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఈ సంస్థ దాని కంటెంట్, భద్రతా నియమాలను అమలు చేయడంలో భాగంగా కొత్త "ట్రస్ట్ అండ్ సేఫ్టీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్"ని నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రదేశంలో 100 మంది కంటెంట్ మోడరేటర్‌లను నియమించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని X వ్యాపార కార్యకలాపాల అధిపతి జో బెనారోచ్ తెలిపారు. ఈ గ్రూప్ ప్రధానంగా పిల్లల లైంగిక దోపిడీ, పోరాట సంబంధిత విషయాలపై దృష్టి సారిస్తుందని అన్నారు.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Athapur: మోసం చేసిన ప్రియుడు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

దీంతోపాటు ద్వేషపూరిత ప్రసంగాలు, హింసాత్మక పోస్ట్‌లపై కూడా పరిమితులు విధించనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో తమ ఎక్స్ ప్లాట్‌ఫాం ద్వారా నేరాలకు సంబంధించిన చర్యలను ఆపడానికి తాము ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. Xలో ఖాతా తెరిచేందుకు వ్యక్తులకు కనీసం 13 ఏళ్లు ఉండాలని పేర్కొన్నారు. కంపెనీ తన రోజువారీ వినియోగదారులలో 1% కంటే తక్కువ మంది 13-17 ఏళ్ల మధ్య వయస్సు గలవారు ఉన్నారని తెలిపింది. అయితే 17 ఏళ్లు అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారిని ప్రకటనకర్తలు లక్ష్యంగా చేసుకోలేరని జో బెనారోచ్ చెప్పారు. కానీ ఈ కొత్త కేంద్రం ఎప్పుడు పని చేస్తుందో ఆయన వెల్లడించలేదు.

Updated Date - Jan 28 , 2024 | 11:13 AM