Share News

Elon Musk: Xలో అశ్లీల కంటెంట్ అనుమతి.. విమర్శలు

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:18 AM

టెస్లా, స్పేస్ ఎక్స్‌, ఎక్స్ యాప్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో అసభ్యకరమైన అడల్ట్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసే అవకాశం కల్పించినప్పటి నుంచి మస్క్ నిర్ణయం పట్ల అనేక విమర్శలు వచ్చాయి. దీంతో ఇప్పుడు మస్క్ వెనక్కి తగ్గారు. అయితే ఏం నిర్ణయం తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Elon Musk: Xలో అశ్లీల కంటెంట్ అనుమతి.. విమర్శలు
Elon Musk X New Update Feature Porn Free Mode

టెస్లా, స్పేస్ ఎక్స్‌, ఎక్స్ యాప్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో అసభ్యకరమైన అడల్ట్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసే అవకాశం కల్పించినప్పటి నుంచి మస్క్ నిర్ణయం పట్ల అనేక విమర్శలు వచ్చాయి. దీంతో ఇప్పుడు మస్క్ వెనక్కి తగ్గారు. వినియోగదారులకు అడల్ట్ కంటెంట్ పోర్న్ రహిత అనుభవాన్ని అందించడానికి కొత్త ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు స్పష్టం చేశారు. తాజా అప్‌డేట్‌లో ఎలాన్ మస్క్ అటువంటి కంటెంట్‌ను చూడకూడదనుకునే వారికి పోర్న్ ఫ్రీ ఫీచర్ తీసుకొస్తున్నట్లు చెప్పారు.


మే 2024లో ఎలాన్ మస్క్ లాంగ్ ఫాం కథనాలు, మానిటైజేషన్ ప్రోగ్రామ్, పూర్తి నిడివి వీడియోలు వంటి కొత్త ఫీచర్‌లను కూడా పరిచయం చేశారు. ఆ క్రమంలో చందా పొందిన వినియోగదారులు ఈ ప్లాట్‌ఫారమ్‌లో చలనచిత్రాలు, టీవీ సిరీస్‌లు లేదా ఏఐ అడల్ట్ కంటెంట్, గ్రాఫిక్ పోస్టులు, పాడ్‌కాస్ట్‌లను పోస్ట్ చేయవచ్చు. దీంతో మానిటైజేషన్ ద్వారా డబ్బు కూడా సంపాదించవచ్చని మస్క్ చెప్పారు అయితే అడల్ట్ కంటెంట్‌పై అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు.


దీంతో ఎలాన్ మస్క్ ఈ ఫీచర్‌లో మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అడల్ట్ కంటెంట్‌ను వద్దనుకునేవారు మీడియా సెట్టింగ్‌లను సర్దుబాటు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో అశ్లీల కంటెంట్‌ లేదా వ్యక్తుల ఆబ్జెక్టిఫికేషన్‌ను ప్రోత్సహించే లేదా మైనర్‌లకు హాని కలిగించే ఏదైనా కంటెంట్‌ను X నిషేధిస్తుందని వెల్లడించారు. అంతేకాదు 18 ఏళ్లలోపు వినియోగదారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో తమ పుట్టిన తేదీని అందించని వారు అశ్లీల కంటెంట్‌ పోస్ట్‌లను వీక్షించలేరని పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి:

Mobiles: ఫోన్ల వెనక వాలెట్లు ఉంచుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా


Smart Phone: మీరు మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు.. ఇలా తెలుసుకోండి

Read Latest Technology News and Telugu News

Updated Date - Jun 06 , 2024 | 11:55 AM