Share News

Instagram stories: ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ను హైడ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఈ స్టెప్స్ ఫాలో అవండి..

ABN , Publish Date - Jan 05 , 2024 | 08:18 PM

మీరు తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుతుంటారా? ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లను అప్‌లోడ్ చేస్తుంటారా? మీ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలను అందరూ వీక్షించడం మీకు ఇబ్బందిగా ఉందా? మీ స్టోరీ అందరూ చూడకుండా కంట్రోల్ ఉంటే బాగుండేదని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.

Instagram stories: ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ను హైడ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఈ స్టెప్స్ ఫాలో అవండి..

మీరు తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌ను (Instagram) వాడుతుంటారా? ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లను (Instagram stories) అప్‌లోడ్ చేస్తుంటారా? మీ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలను అందరూ వీక్షించడం మీకు ఇబ్బందిగా ఉందా? మీ స్టోరీ అందరూ చూడకుండా కంట్రోల్ ఉంటే బాగుండేదని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చిన అప్‌డేట్ ఆ వెసులుబాటు కల్పిస్తోంది. ఇకపై మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లను కేవలం మీరు కోరుకున్న వారు మాత్రమే చూడొచ్చు (How to hide Instagram stories).

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ను హైడ్ చేసేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవండి..

1) ఇన్‌స్టాగ్రామ్ తెరిచి మీ ప్రొఫైల్ పేజీకి వెళ్లండి.

2) పైన కుడి వైపు ఉన్న హాంబర్గర్ మెనూపై క్లిక్ చేసి ``సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ``ని ఎంచుకోండి.

3) ``హూ కెన్ సీ యువర్ కంటెంట్``లోకి వెళ్లి ``హైడ్ స్టోరీ అండ్ లైవ్``పై క్లిక్ చేయండి.

4) మీ స్టోరీని ఎవరు చూడకడదనుకుంటున్నారో ఆ అకౌంట్‌పై క్లిక్ చేయండి. అక్కడ ఒకేసారి ఎక్కువ అకౌంట్లను కూడా సెలెక్ట్ చేసుకుని వారు మీరు స్టోరీ చూడకుండా హైడ్ చేసుకోవచ్చు.

అలాగే ఇన్‌స్టాగ్రామ్ తాజాగా మరో అప్‌డేట్‌ను కూడా చేర్చింది. మీరు ఎవరి అకౌంట్‌నైనా అన్-ఫాలో అవకుండానే వారి కంటెంట్ మీకు రాకుండా చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ సెట్టింగ్స్‌లో ``వాట్ యూ సీ`` సెక్షన్‌లో మ్యూట్ అకౌంట్ అప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది.

Updated Date - Jan 05 , 2024 | 08:18 PM