Share News

Apple: ఆపిల్ కొత్త మ్యాక్‌బుక్ రిలీజ్.. ఫీచర్లు అదుర్స్, రేటు కూడా

ABN , Publish Date - Mar 05 , 2024 | 10:27 AM

ఆపిల్(Apple) కొత్త M3 చిప్‌తో నడిచే కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ను ఆవిష్కరించింది. ఈ ల్యాప్‌టాప్ రెండు సైజు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

Apple: ఆపిల్ కొత్త మ్యాక్‌బుక్ రిలీజ్.. ఫీచర్లు అదుర్స్, రేటు కూడా

ప్రముఖ టెక్ సంస్థ యాపిల్(Apple) తాజాగా MacBook Air మోడల్‌లను ప్రారంభించింది. ఇది M3 చిప్‌తో వస్తుందని టెక్ దిగ్గజం సోమవారం ప్రకటించింది. ఈ చిప్ మునుపటి M1 మోడల్‌ల కంటే 60 శాతం వేగవంతంగా పనిచేస్తాయని వెల్లడించింది. దీంతోపాటు Intel ఆధారిత MacBook కంటే 13 రెట్లు దీని పనితీరు బాగుంటుందని తెలిపింది.

ఈ కొత్త MacBook Air, 13, 15 అంగుళాల పరిమాణాలలో అందుబాటులో ఉంది. 18 గంటల బ్యాటరీ లైఫ్‌తో తేలికైన డిజైన్‌తో సన్నగా ఉంది. ఇది లిక్విడ్ రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంది. మెరుగైన మల్టీ టాస్కింగ్ సామర్థ్యాలను కల్గి ఉంది. ఈ ల్యాప్‌టాప్ వేగవంతమైన ఇంటర్నెట్ వేగం Wi-Fi 6Eని కలిగి ఉంది. ఇది నాలుగు రంగులలో లభిస్తుంది. మిడ్‌నైట్, స్టార్‌లైట్, స్పేస్ గ్రే, సిల్వర్. దీనిని విద్యార్థుల నుంచి వ్యాపార నిపుణుల వరకు అనేక మంది వినియోగదారులు ఉపయోగించవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.


M3 చిప్, 3 నానోమీటర్ టెక్నాలజీని ఉపయోగించి ఇది తయారు చేయబడింది. 8 కోర్ CPU, 10 కోర్ GPU, 24GB వరకు మెమరీ సపోర్ట్ సౌకర్యాలు ఉన్నాయి. ఇది ఫోటో, వీడియో ఎడిటింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, గేమింగ్ వంటి పనులకు బాగా ఉపయోగపడుతుంది. ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ పర్యావరణ అంశాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది.

మార్చి 8న శుక్రవారం నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. 13 అంగుళాల మోడల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ప్రారంభ ధర రూ. 1,14,900, విద్య కోసం రూ. 1,04,900. 15 అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్ ప్రారంభ ధర రూ.134,900, విద్య కోసం రూ. 124,900గా ప్రకటించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Elon Musk: ఎలాన్ మస్క్‌పై వెయ్యి కోట్ల దావా వేసిన నలుగురు..అసలేమైంది?

Updated Date - Mar 05 , 2024 | 10:27 AM