Share News

Viral Video: WPL ఫస్ట్ టైటిల్‌ గెల్చుకున్న ఆర్సీబీ.. స్మృతి మంధానకు విరాట్ కోహ్లీ ఫోన్

ABN , Publish Date - Mar 18 , 2024 | 09:36 AM

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024) మొదటి లీగ్ టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు నిన్న కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ గెల్చిన వెంటనే మాజీ ఆర్సీబీ జట్టు కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్మృతి మంధానకు వీడియో కాల్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: WPL ఫస్ట్ టైటిల్‌ గెల్చుకున్న ఆర్సీబీ.. స్మృతి మంధానకు విరాట్ కోహ్లీ ఫోన్

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024) మొదటి లీగ్ టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు నిన్న కైవసం చేసుకుంది. ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టును ఓడించి RCB మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana) నేతృత్వంలో విజయం సాధించారు. ఆ నేపథ్యంలో మ్యాచ్ గెలిచిన వెంటనే మాజీ ఆర్సీబీ జట్టు కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) స్మృతి మంధానకు వీడియో కాల్ చేసి టీమ్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఆ క్రమంలో విరాట్ కోహ్లీ(kohli) కాల్ చూసిన టీమ్ సభ్యులు సంతోషంతో కేరింతలు కొట్టారు.

ఆదివారం న్యూఢిల్లీ(delhi)లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ సంఘటన చోటుచేసుకుంది. చివరి మ్యాచ్‌లో మంధాన జట్టు 114 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలోనే ఛేదించింది. RCB విజయంలో 21 ఏళ్ల శ్రేయాంక పాటిల్ కీలక పాత్ర పోషించింది. నాలుగు వికెట్లు తీసి ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టును 113 పరుగులకు కుదించింది.


ఈ నేపథ్యంలో కోహ్లితో పాటు RCB మహిళా జట్టుకు అనేక మంది మాజీ క్రీడాకారులు కూడా సోషల్ మీడియా(social media) వేదికగా అభినందనలు తెలియజేశారు. వారిలో గ్లెన్ మాక్స్‌వెల్, మయాంక్ అగర్వాల్, యుజ్వేంద్ర చాహల్‌తో పాటు మహ్మద్ షమీ, వెంకటేష్ ప్రసాద్, వీవీఎస్ లక్ష్మణ్ సహా పలువురు ఉన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: WPL Winner RCB : ఆర్సీబీదే అందలం

Updated Date - Mar 18 , 2024 | 09:37 AM