Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Team India: న్యూజిలాండ్‌ ఓటమి భారత్‌కు గుడ్‪న్యూస్.. పాయింట్ల పట్టికలో..

ABN , Publish Date - Mar 03 , 2024 | 12:10 PM

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టు ఓటమి పాలవడం ప్రస్తుతం టీమిండియాకు మంచి ఛాన్స్ వచ్చింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానానికి చేరుకుంది.

Team India: న్యూజిలాండ్‌ ఓటమి భారత్‌కు గుడ్‪న్యూస్.. పాయింట్ల పట్టికలో..

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌(newzealand) జట్టు ఓటమి పాలవడం ప్రస్తుతం టీమిండియా(team india)కు మంచి ఛాన్స్ వచ్చింది. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా(Australia) జట్టు 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్‌కు ఆస్ట్రేలియా మంచి బహుమతిని అందించింది. కివీస్ జట్టు ఓటమి కారణంగా భారత్ ICC WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ క్రమంలో భారత అభిమానులు ఆస్ట్రేలియా జట్టుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ మ్యాచ్‌లో స్పిన్ బౌలర్ నాథన్ లియాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టి కివీస్ బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం చెలాయించాడు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral Video: చాహల్‌ను ఎత్తుకుని గిరగిరా తిప్పేసిన సంగీతా ఫోగట్


అయితే ఈ మ్యాచ్‌కు ముందు WTC పాయింట్ల పట్టికలో భారత జట్టు(team india) రెండవ స్థానంలో ఉంది. నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ను భారత్ ఓడించినప్పటికీ మెరుగైన పాయింట్ల కారణంగా న్యూజిలాండ్(newzealand) అగ్రస్థానంలో కొనసాగింది. దీంతో భారత జట్టు రెండవ స్థానంలో ఉంది. కానీ ఇప్పుడు కివీస్ జట్టు ఓటమితో భారత్ లాభపడింది. పాయింట్ల పట్టికలో కివీస్‌ను వెనక్కి నెట్టి టీమిండియా జట్టు 62 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్‌ను ఓడించిన ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.

ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు రెండో స్థానానికి చేరుకుంది. కంగారూపై ఓటమి తర్వాత కివీస్ జట్టు పాయింట్లు తగ్గాయి. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా(Australia) కంటే పైనే ఉంది. కివీస్ జట్టు 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 ఓటములతో రెండో స్థానంలో ఉంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు పాయింట్ల ప్రయోజనాన్ని పొందినప్పటికీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మార్చి 8 నుంచి మార్చి 12 మధ్య కంగారూ జట్టు కివీస్ జట్టుతో మరో టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది కాబట్టి ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు పునరాగమనం చేస్తుందా లేదా కంగారూ జట్టు మరోసారి ఆధిపత్యం చెలాయిస్తుందా అనేది చూడాలి.

Updated Date - Mar 03 , 2024 | 12:10 PM