Share News

Injury: ప్రముఖ క్రీడాకారుడికి గాయం..ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఔట్!

ABN , Publish Date - Jan 07 , 2024 | 03:51 PM

22 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకున్న ప్రముఖ స్పానిష్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్‌(rafael nadal)కు గాయమైంది. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్‌లో క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోయిన సమయంలో తన తొడ కండరానికి గాయమైందని పేర్కొన్నారు.

Injury: ప్రముఖ క్రీడాకారుడికి గాయం..ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఔట్!

22 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకున్న ప్రముఖ స్పానిష్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్‌(rafael nadal)కు గాయమైంది. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్‌లో క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోయిన సమయంలో తన తొడ కండరానికి గాయమైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియన్ ఓపెన్(australian open 2024) నుంచి వైదొలుగుతున్నట్లు ఓ ట్వీట్ చేస్తూ తెలిపారు. అందరికీ హాయ్ బ్రిస్బేన్‌లో నా చివరి మ్యాచ్‌లో కండరాలపై చిన్న సమస్య ఏర్పడింది. అది మీకు తెలిసినట్లుగా నన్ను ఆందోళనకు గురిచేసింది.

తాను మెల్‌బోర్న్‌కి చేరుకున్న తర్వాత MRI స్కాన్ చేయగా తొడ కండరాలపై మైక్రో టియర్ ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం తాను 5 సెట్ మ్యాచ్‌లలో ఆటగాళ్లతో పోటీ పడటానికి సిద్ధంగా లేనని చెప్పారు. ఆ క్రమంలో వైద్యుడిని సంప్రదించగా కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్లు వెల్లడించారు. దీంతో తాను స్పెయిన్‌కు తిరిగి వెళ్తున్నట్లు తెలిపారు.


బ్రిస్బేన్ ఇంటర్నేషనల్‌లో ఆస్ట్రేలియా(australia)కు చెందిన జోర్డాన్ థాంప్సన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ ఓటమి సమయంలో నాదల్ గాయంతో బాధపడ్డాడు. జనవరి 5న 3 గంటల 26 నిమిషాల వరకు సాగిన ఈ పోటీలో నాదల్ తీవ్రంగా పోరాడాడు. కానీ కానీ రెండో సెట్ టై బ్రేకర్‌లో అతను రెండు మ్యాచ్ పాయింట్‌లను కోల్పోవడంతో గాయం అతనిని వెనక్కి నెట్టినట్లు అనిపించింది. జనవరి 14 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందున్న ATP 250 టోర్నమెంట్ అయిన బ్రిస్బేన్ ఇంటర్నేషనల్‌లో నాదల్ ఒక సంవత్సరం తర్వాత మొదటి సారి పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 03:51 PM