Share News

IPL 2024: రేపటి CSK vs RCB మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు?.. ప్రిడిక్షన్ చూశారా?

ABN , Publish Date - Mar 21 , 2024 | 04:16 PM

ఐపీఎల్ 2024 17వ సీజన్ ప్రారంభానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. రేపు జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచులో ఏ జట్టుకు ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

IPL 2024: రేపటి CSK vs RCB మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు?..  ప్రిడిక్షన్ చూశారా?

ఐపీఎల్ 2024(IPL 2024) 17వ సీజన్ ప్రారంభానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. రేపు జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. అయితే రెండు జట్లలో కూడా అనుభవజ్ఞులైన మంచి ఆటగాళ్లు ఉన్నారు. అంతేకాదు రెండు జట్లూ కూడా ఈ సీజన్‌ను గెలుపుతో ప్రారంభించాలనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచులో ఏ జట్టుకు ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

ఇక ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు సీఎస్‌కే, ఆర్‌సీబీ మధ్య మొత్తం 31 మ్యాచ్‌లు జరుగగా అందులో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కే 20 మ్యాచ్‌లు గెలిచింది. ఆర్‌సీబీ జట్టు కేవలం 10 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలవగలిగింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్ అసంపూర్తిగా పూర్తైంది. 2021 నుంచి 2023 వరకు రెండు జట్ల మధ్య జరిగిన చివరి ఐదు మ్యాచ్‌లలో CSK నాలుగు మ్యాచ్‌లు గెలుపొందగా, RCB ఒక మ్యాచ్‌లో గెలిచింది. ఈ విధంగా చూస్తే ఆర్‌సీబీతో పోలిస్తే రుతురాజ్ గైక్వాడ్ జట్టుదే పైచేయి ఉంటుందని అనిపిస్తుంది.


ఏ జట్టు గెలుస్తుంది?

ఇక రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని CSK జట్టు ఈ సీజన్‌లో తన సొంత మైదానం MA చిదంబరం స్టేడియంలో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఏ జట్టుకైనా సొంత మైదానంలో CSKని ఓడించడం సవాలు అనే చెప్పవచ్చు. మరోవైపు CSKతో పోలిస్తే RCBకి స్పిన్నర్లు కూడా తక్కువగా ఉండటం లోటే అనిపిస్తుంది. కానీ RCBలో మంచి బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. కాబట్టి ఈ సీజన్‌లో ఫాఫ్ డుప్లెసిస్‌తో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్‌కు వస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. గత సీజన్‌లో వారి ఓపెనింగ్ జోడీ చాలా విజయవంతమైంది. కానీ టీ20 క్రికెట్‌లో ఒక్క ఆటగాడు మ్యాచ్ ఫార్మాట్‌ మొత్తాన్ని మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కశ్చితంగా ఏ జట్టు గెలుస్తుందని చెప్పడం కొంచెం కష్టమే.

తలపడనున్న జట్లు

చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings) జట్టులో రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్యా రహానే, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, డారిల్ మిచెల్, మహేంద్ర సింగ్ ధోని, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ముస్తాఫిజుర్ రెహమాన్ ఉన్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(royal challengers bangalore) జట్టులో విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేశాయ్, దినేష్ కార్తీక్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, రీస్ టాప్లీ, మహ్మద్ సిరాజ్, కరణ్ శర్మ కలరు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: IPL 2024: కీలక 12 మంది ఆటగాళ్లు ఈ ఐపీఎల్‌కు దూరం.. ఈ లిస్ట్ చుశారా?

Updated Date - Mar 21 , 2024 | 04:35 PM