Share News

IPL 2024: నేడు RCB vs PBKS పోరు.. సొంత గ్రౌండ్‌లో గెలుస్తారా?

ABN , Publish Date - Mar 25 , 2024 | 11:51 AM

ఐపీఎల్ 2024(ipl 2024)లో ఓటమితో ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) ఈరోజు నెక్ట్స్ మ్యాచుకు సిద్ధమైంది. ఈ ఆరో మ్యాచ్ తమ సొంత స్టేడియం బెంగళూరు( Bengaluru) చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)తో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు ఎక్కువగా గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

IPL 2024: నేడు RCB vs PBKS పోరు.. సొంత గ్రౌండ్‌లో గెలుస్తారా?

ఐపీఎల్ 2024(ipl 2024)లో ఓటమితో ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) ఈరోజు నెక్ట్స్ మ్యాచుకు సిద్ధమైంది. ఈ ఆరో మ్యాచ్ తమ సొంత స్టేడియం బెంగళూరు(Bengaluru) చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)తో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే పంజాబ్, బెంగళూరు రెండు జట్లు కూడా స్టార్ ప్లేయర్‌లతో నిండి ఉండటం విశేషం. ఇక ఈ రెండు జట్ల ఆటగాళ్లు హోలీ(holi) రోజున తమ జట్టును గెలిపించేందుకు ప్రయత్నించనున్నారు. టోర్నీలో తొలి మ్యాచ్‌లో గెలిచిన పంజాబ్ రెండో మ్యాచ్‌లోనూ గెలవాలని చూస్తోంది. మరోవైపు సొంత మైదానంలో మొదటి విజయాన్ని రుచి చూడాలని ఆర్సీబీ(RCB) భావిస్తోంది.


చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో ఫీల్డ్ ఉంటే బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ(virat kohli), ఫాఫ్ డు ప్లెసిస్‌లు(Faf du Plessis) ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ మైదానంలో వీరిద్దరి గత రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. దీంతో పాటు శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టోలు కూడా మెప్పించనున్నారు. అయితే గూగుల్ అంచనా(google) ప్రకారం(prediction) ఈ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలిచేందుకు 56 శాతం అవకాశం ఉండగా, పంజాబ్ కింగ్స్‌(PBKS) జట్టుకు 44 శాతం ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ అంచనాలు నిజం అవుతాయో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టులో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, అనుజ్ రావత్ (WK), దినేష్ కార్తీక్, రీస్ టాప్లీ/అల్జారీ జోసెఫ్, కర్ణ్ శర్మ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్ కలరు.

పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టులో శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Kamindu Mendis: 147 ఏళ్ల క్రికెట్ రికార్డును చిత్తు చేసిన శ్రీలంక బ్యాట్స్‌మెన్

Updated Date - Mar 25 , 2024 | 11:52 AM