Share News

IPL 2024: నేడు PBKS vs RR మ్యాచ్ విన్ ప్రిడిక్షన్.. సొంత మైదానంలో RRను కట్టడి చేస్తారా

ABN , Publish Date - Apr 13 , 2024 | 08:25 AM

నేడు ఐపీఎల్ 2024(IPL 2024)లో 27వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్(Punjab Kings), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్ల మధ్య జరగనుంది. ప్రస్తుతం శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు నంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే నేడు జరిగే మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు చుద్దాం.

 IPL 2024: నేడు PBKS vs RR మ్యాచ్ విన్ ప్రిడిక్షన్.. సొంత మైదానంలో RRను కట్టడి చేస్తారా
ipl 2024 27th match PBKS vs RR Match

నేడు ఐపీఎల్ 2024(IPL 2024)లో 27వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్(Punjab Kings), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్ల మధ్య జరగనుంది. ప్రస్తుతం శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడగా, అందులో 2 గెలిచింది. మూడు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు నంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడగా, అందులో 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే నేడు జరిగే మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు చుద్దాం.


ఈ మ్యాచ్ మొహాలీలోని ముల్లన్‌పూర్‌(Mullanpur)లోని మహారాజా యద్వేంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం రాత్రి 7.30 గంటలకు మొదలుకానుంది. ఇప్పటి వరకు ఇక్కడ రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసే జట్టు సులువుగా 180 పరుగులు చేయగలదు. పవర్‌ప్లే సమయంలో ఫాస్ట్ బౌలర్లు పిచ్ నుంచి సపోర్ట్ పొందుతారు. అయితే పంజాబ్ జట్టు సొంత మైదానం కావడం వల్ల ఇక్కడ ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తోంది.

ఈ ఇరు జట్ల మధ్య జరిగిన గత 5 మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్(PBKS) రెండింట్లో విజయం సాధించింది. ఈ జట్ల చివరి మ్యాచ్ 2023లో జరిగింది. అప్పుడు రాజస్థాన్ రాయల్స్(RR) 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్‌పై పంజాబ్‌ అత్యధిక స్కోరు 223 పరుగులు కాగా, PBKSపై RR అత్యధిక స్కోరు 226. ఇక గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే రాజస్థాన్ రాయల్స్ జట్టు 56 శాతం గెలిచే అవకాశం ఉండగా, పంజాబ్ కింగ్స్ జట్టు 44 శాతం గెలిచే ఛాన్స్ ఉంది.


పంజాబ్(Punjab Kings) ప్రాబబుల్ టీమ్‌లో శామ్ కుర్రాన్, హర్షల్ పటేల్, జితేష్ శర్మ (WK), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (C), జానీ బెయిర్‌స్టో, సికందర్ రజా, కగిసో రబాడ, హర్‌ప్రీత్ బ్రార్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ ఉన్నారు.

రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ప్రాబబుల్ టీమ్‌లో ధృవ్ జురెల్, జోష్ బట్లర్, యశస్వి జైస్వాల్, ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), ర్యాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, కుల్దీప్ సేన్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్ కలరు.


ఇది కూడా చదవండి:

ఢిల్లీ.. భళా

ఇప్పట్లో రిటైర్‌ కాను: రోహిత్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం

Updated Date - Apr 13 , 2024 | 08:31 AM