Share News

India Vs England: ఇంగ్లండ్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం..సిరీస్‌ కైవసం

ABN , Publish Date - Feb 26 , 2024 | 01:46 PM

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగో టెస్టు మ్యాచులో కూడా భారత్ అదరగొట్టింది. ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది.

India Vs England: ఇంగ్లండ్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం..సిరీస్‌ కైవసం

రాంచీ(ranchi) టెస్టులో నాలుగో రోజు భారత జట్టు ఇంగ్లండ్(england) జట్టుపై 152 పరుగుల దూరంలో నిలవగా ఈ లక్ష్యాన్ని సులభంగా ఛేధించింది. ఈ క్రమంలో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్ ఆధారంగా 46 పరుగుల ఆధిక్యం పొందిన తరువాత, వారు తమ రెండవ ఇన్నింగ్స్‌లో కేవలం 145 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆ తర్వాత మూడవ రోజున ఇంగ్లాండ్(india vs england) టీమిండియాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ క్రమంలో భారత్ ఐదు వికెట్ల నష్టానికి టార్గెట్ పూర్తి చేసింది. దీంతో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 3-1 ఆధిక్యంలో ఉంది.


మూడో రోజు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ వరకు ఇంగ్లండ్‌ జట్టు ముందుంది. అయితే నాలుగో రోజుకి మాత్రం భారత్‌దే పైచేయి అయ్యింది. రాంచీ(ranchi)లో ముందుగా బౌలింగ్ చేసి టెస్టుల్లో విజయం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. రాంచీ టెస్టులో భారత్ గెలవడం ద్వారా 5 టెస్టుల సిరీస్‌ను మాత్రమే కాకుండా, ఈ వేదికపై ఆడిన 3 టెస్టుల్లో ఇది రెండో విజయం. ఇంతకు ముందు ఆడిన రెండు టెస్టుల్లో ఒకటి విజయం సాధించగా, మరొకటి డ్రాగా ముగిసింది. గత 10 ఏళ్లలో భారత్ 150 ప్లస్ లక్ష్యాన్ని ఒక్కసారి మాత్రమే విజయవంతంగా ఛేదించింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Tamil Nadu: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ.. తమిళ్ మానిలా కాంగ్రెస్ కీలక ప్రకటన..

Updated Date - Feb 26 , 2024 | 01:59 PM