Share News

ICC: ఆ క్రికెటర్‌‌పై అవినీతి ఆరోపణలు..రెండేళ్ల నిషేధం

ABN , Publish Date - Jan 16 , 2024 | 08:30 PM

బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ నాసిర్ హొస్సేన్‌(Nasir Hossain)పై ఐసీసీ(ICC) వేటు వేసింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో రెండేళ్లపాటు నిషేధం విధించింది.

ICC: ఆ క్రికెటర్‌‌పై అవినీతి ఆరోపణలు..రెండేళ్ల నిషేధం

బంగ్లాదేశ్(Bangladesh) ఆల్‌రౌండర్ నాసిర్ హొస్సేన్‌పై ఐసీసీ వేటు వేసింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో రెండేళ్లపాటు నిషేధం విధించింది. సెప్టెంబర్ 2023లో నాసిర్ హుస్సేన్‌(Nasir Hossain)పై ICC అభియోగాలు మోపింది. నాసిర్ హుస్సేన్ మూడు ఆరోపణలను అంగీకరించారు. ఈ క్రమంలో నాసిర్ హుస్సేన్‌పై రెండేళ్ల నిషేధం విధించగా..అందులో 6 నెలల నిషేధం కూడా ఉంది.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Shivam Dube: నాలోని ప్రతిభను గుర్తించింది ధోనీయే.. సీఎస్కే కెప్టెన్‌కు, కోచ్‌కు థ్యాంక్స్ చెప్పిన శివమ్ దూబే!

నాసిర్ హుస్సేన్ తనకు లభించిన బహుమతిని నియమించబడిన అవినీతి నిరోధక అధికారికి వెల్లడించలేదు. అందులో అతను US 750 డాలర్ల విలువైన కొత్త iPhone 12ని అందుకున్నాడు. దీంతోపాటు నాసిర్ హుస్సేన్ దర్యాప్తులో నియమించబడిన అవినీతి నిరోధక అధికారికి సహకరించకపోవడంతోపాటు పలు అంశాలు ఉన్నాయి.

ఈ క్రమంలో నాసిర్ హుస్సేన్ నిషేధం తర్వాత ఏప్రిల్ 7, 2025న క్రికెట్ కార్యకలాపాలలో చేరనున్నారు. 2020-21 అబుదాబి T10లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పుణె డెవిల్స్ ఫ్రాంచైజీతో సంబంధం ఉన్న ఎనిమిది మంది వ్యక్తులలో నాజర్ హుస్సేన్ కూడా ఉన్నారు. నాసిర్ హుస్సేన్ 2011 నుంచి 2018 వరకు బంగ్లాదేశ్ తరపున 19 టెస్టులు, 65 ODIలు, 31 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు (మొత్తం 115 అంతర్జాతీయ మ్యాచ్‌లు) ఆడాడు.

Updated Date - Jan 16 , 2024 | 08:30 PM