Share News

India vs England: ఇంగ్లండ్ ఆలౌట్..భారత్ బ్యాటింగ్, స్కోర్ ఏంతంటే

ABN , Publish Date - Feb 24 , 2024 | 11:21 AM

రాంచీ టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. జో రూట్ 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

India vs England: ఇంగ్లండ్ ఆలౌట్..భారత్ బ్యాటింగ్, స్కోర్ ఏంతంటే

రాంచీ వేదికగా టీమిండియా, ఇంగ్లండ్(india vs england) జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు(4th test) తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 353 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు తొలి సెషన్‌లో రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేసి తర్వాతి మూడు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా మొత్తం 4 వికెట్లు తీశాడు. ఈ టెస్టులో అరంగేట్రం చేసిన ఆకాశ్‌దీప్‌కు మూడు వికెట్లు దక్కాయి. జో రూట్ నాటౌట్‌గా నిలిచాడు.

ఇక ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ మొదలు పెట్టగా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రోహిత్ రెండు రన్స్ చేసి ఔట్ కాగా.. శుభ్‌మన్‌గిల్ క్రీజు లోకి వచ్చారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: WPL 2024: ఉత్కంఠ మ్యాచులో లాస్ట్ బంతికి సిక్స్.. థ్రిల్లింగ్ విక్టరీ


టాస్ గెలిచిన ఇంగ్లండ్(england) ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఒకానొక సమయంలో మ్యాచ్ తొలి రోజు ఇంగ్లండ్ 112 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయినప్పటికీ, ఆ తర్వాత జో రూట్ ఇన్నింగ్స్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో చివరి వికెట్‌ జేమ్స్‌ అండర్సన్‌ రూపంలో వచ్చింది. అండర్సన్‌ను జడేజా ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ చేయగా.. 4 బంతులు ఆడినా అండర్సన్ ఖాతా తెరవలేకపోయాడు. ఇంగ్లండ్‌లో రూట్‌తో పాటు రాబిన్సన్ 58 పరుగులు, జేమ్స్ ఫాక్స్ 47 పరుగులు చేశారు.

రాంచీ టెస్టు రెండో రోజు ఇంగ్లండ్ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్ రూపంలో చివరి మూడు వికెట్లను కోల్పోయింది. 302/7తో ఇంగ్లండ్ రెండో రోజు ఆటను ప్రారంభించింది. సిరాజ్ తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. దీని తర్వాత జడేజా రాబిన్సన్‌ను పెవిలియన్‌కు పంపాడు. రాబిన్సన్ 96 బంతుల్లో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో షోయబ్ బషీర్ కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత అండర్సన్ కూడా 0 వద్ద ఔటయ్యాడు.

Updated Date - Feb 24 , 2024 | 11:21 AM