Share News

Virat Kohli: ‘టీ20 వరల్డ్ కప్‌‌ జట్టులో విరాట్ కోహ్లీ ఉండకూడదు’

ABN , Publish Date - Apr 13 , 2024 | 02:09 PM

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (IPL) సంగతి అటుంచితే.. ఈ ఏడాదిలో త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) భారత జట్టులో ఉంటాడా? లేదా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఈ మిస్టరీకి ఎప్పుడు తెరపడుతుందో తెలీదు కానీ..

Virat Kohli: ‘టీ20 వరల్డ్ కప్‌‌ జట్టులో విరాట్ కోహ్లీ ఉండకూడదు’

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (IPL) సంగతి అటుంచితే.. ఈ ఏడాదిలో త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) భారత జట్టులో ఉంటాడా? లేదా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఈ మిస్టరీకి ఎప్పుడు తెరపడుతుందో తెలీదు కానీ.. కోహ్లీ తప్పకుండా భారత జట్టులో భాగమవుతాడన్న వాదనలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే.. తోటి క్రికెటర్ మాత్రం టీ20 వరల్డ్ కప్ జట్టులో కోహ్లీ ఉండకూడదని షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ.. అతనెవరో తెలుసా? మరెవ్వరో కాదు.. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ & రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell).

Rishabh Pant: అంపైర్‌తో రిషభ్ పంత్ గొడవ.. జరిమానా విధించాల్సిందేనా?


‘‘విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. ముఖ్యంగా.. ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయాల్లో చాకచక్యంగా రాణిస్తాడు. నేను ఇలాంటి ఆటగాడ్ని ఎప్పుడూ చూడలేదు. ఒకసారి 2016 టీ20 వరల్డ్ కప్ రోజుల్ని గుర్తు చేసుకుంటే.. మొహాలిలో అతడు మాపై ఆడిన ఇన్నింగ్స్ మరువలేనిది. అతని కెరీర్‌లోని ఉత్తమ ఇన్నింగ్స్‌లలో అది ఒకటి. ఆ ఇన్నింగ్స్ ఆట స్వరూపాన్నే మార్చేసింది. ఆరోజు కోహ్లీ ఆడిన ఆట ఎంతో భిన్నమైనది, మాటల్లో వర్ణించలేనిది. టేబుల్ టెన్నిస్ తరహాలో ఎడాపెడా షాట్లతో చెలరేగాడు. ప్రపంచంలోనే అలాంటి ఇన్నింగ్స్‌కి సాటి లేదు. జట్టుని గెలిపించడం కోసం అతనికున్న అవగాహన అసాధారణమైనది. ఆర్సీబీలో అతనితో ఆడటం ఒక ప్రత్యేకమైన ఎక్స్‌పీరియన్స్. కానీ.. అతనికి విరుద్ధంగా ఆడాల్సి ఉంటుంది కాబట్టి.. వరల్డ్‌కప్‌లో భారత జట్టుకి అతడ్ని ఎంపిక చేయకూడదని నేను కోరుకుంటున్నాను’’ అంటూ మ్యాక్స్‌వెల్ చెప్పుకొచ్చాడు.

ఉదయం టిఫిన్ చేయట్లేదా.. తస్మాత్ జాగ్రత్త!

కాగా.. 2016 టీ20 వరల్డ్‌కప్‌లో మొహాలి భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విలయతాండవం చేశాడు. 161 లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడు కోహ్లీ ఒక్కడే ఆసిస్ బౌలర్లను చాకచక్యంగా ఎదుర్కొని.. జట్టుని గెలుపు దిశగా తీసుకెళ్లాడు. ఆచితూచి ఆడుతూ.. వీలు దొరికినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఆ మ్యాచ్‌లో 51 బంతులు ఆడిన కోహ్లీ.. 9 ఫోర్లు, 2 సిక్సులో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడు ఆడిన ఆ గొప్ప ఇన్నింగ్స్ కారణంగా.. భారత్ లక్ష్యాన్ని ఛేధించి, ఆస్ట్రేలియాపై విజయఢంకా మోగించింది. కోహ్లీ ఆడిన ఆట.. చరిత్రలోనే గొప్ప ఇన్నింగ్స్‌గా మిగిలిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 13 , 2024 | 02:09 PM