Share News

Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ చాన్స్.. అడుగు దూరంలో అరుదైన రికార్డు

ABN , Publish Date - Dec 12 , 2024 | 06:54 PM

ఆస్ట్రేలియాతో టెస్టులో ఆశించిన స్థాయి ప్రదర్శన చేయలేక ఇబ్బంది పడుతున్న కోహ్లీకి గోల్డెన్ చాన్స్ వచ్చింది. గబ్బా వేదికపై జరగనున్న టెస్టులో కోహ్లీ ప్రదర్శనపై 147 ఏళ్ల రికార్డు ఆధారపడి ఉంది. ఈ రికార్డును బ్రేక్ చేయగలిగితే కోహ్లీ పూర్ ఫామ్ పటాపంచలవుతుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

 Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ చాన్స్.. అడుగు దూరంలో అరుదైన రికార్డు
Virat Kohli

గబ్బా వేదికపై విరాట్ కోహ్లీ కోసం ఓ అరుదైన రికార్డు ఎదురుచూస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో రాణించలేకపోయిన కోహ్లీకి ఇదొక సువర్ణావకాశంగా కనపడుతోంది. తొలి ఇన్నింగ్స్ లో 5 పరుగులకే ఔటైన కోహ్లీ .. పింక్ బాల్ టెస్టు ఔటింగ్ లో కూడా 7, 11 స్కోరుతో ఉసూరుమనిపించాడు. పెర్త్ లో జరిగిన సెకండ్ ఇన్నింగ్స్ తో కోహ్లీ ఇప్పటికే 30వ టెస్టు సెంచరీని నమోదు చేశాడు.


గబ్బా వేదికగా జరగనున్న మూడో టెస్టులో కోహ్లీ తలుచుుంటే ఓ అరుదైన వారసత్వ రికార్డును సొంతం చేసుకోగలడు. టెస్టు క్రికెటర్ హిస్టరీలో ఆస్ట్రేలియాలోని ఐదు ముఖ్యమైన కేంద్రాలతో సెంచరీ చేసిన ఘనత కోహ్లీ సొంతం చేసుకోగలడు. ఇంతకు ముందు సునీల్ గవాస్కర్, అలిస్టర్ కుక్ ఖాతాలో ఈ రికార్డు ఉంది. అయితే, అందుకు కోహ్లీ ఈ టెస్టులో ఓ సెంచరీ చేయాల్సి ఉంది.


అలిస్టర్ కుక్ సైతం 2006లో పెర్త్ లో సెంచరీ చేసి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ఆసిస్ పర్యటనలో ఆడిలైడ్, బ్రిస్బేన్, సిడ్నీలో 2010-2011 మధ్య ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత మెల్బోర్న్ లో 2017లో ఈ రికార్డును పూర్తి చేశాడు. దీంతో కోహ్లీ ప్రదర్శన కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీ ఖాతాలో ఒక్క ఆస్ట్రేలియాలోనే 12 సెంచరీలున్నాయి. కోహ్లీ బ్రిస్బేన్‌లో కేవలం ఒక టెస్టు మాత్రమే ఆడాడు, అందులో అతను 19, 1 పరుగులు చేశాడు. 2014-15 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అతను సెంచరీ చేయని ఏకైక మ్యాచ్.

Gukesh: ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా గుకేష్..


Updated Date - Dec 12 , 2024 | 07:55 PM