Share News

Jasprit Bumrah: నెటిజన్ తిక్క కుదిర్చిన జస్ప్రీత్ బుమ్రా భార్య సంజన.. అసలు ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Feb 13 , 2024 | 02:15 PM

టీమిండియా పేస్ గన్ జస్‌ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా, బుమ్రా భార్యగా ఆమె అందరికీ సుపరిచితమే. పెళ్లయ్యాక కూడా ఆమె తన వృత్తిని కొనసాగిస్తోంది.

Jasprit Bumrah: నెటిజన్ తిక్క కుదిర్చిన జస్ప్రీత్ బుమ్రా భార్య సంజన.. అసలు ఏం జరిగిందంటే..

టీమిండియా పేస్ గన్ జస్‌ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా, బుమ్రా భార్యగా ఆమె అందరికీ సుపరిచితమే. పెళ్లయ్యాక కూడా ఆమె తన వృత్తిని కొనసాగిస్తోంది. గత సెప్టెంబర్‌లో బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుంచి ఉద్యోగానికి కాస్త విరామం ఇచ్చింది. అయితే బుధవారం ప్రేమికుల దినోత్సవం కావడంతో బుమ్రా దంపతులు ఓ సౌందర్య ఉత్పత్తుల కంపెనీ చేసిన ప్రచారం చిత్రంలో నటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సంజన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ సంజన శరీరాకృతిపై కామెంట్ చేశాడు. ‘‘మీరు చాలా లావుగా ఉన్నారు’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సంజన ‘‘చిన్నప్పుడు స్కూళ్లో సైన్స్ పుస్తకాల్లో మీరు చదువుకున్న పాఠాలు గుర్తు లేవా? మహిళ శరీరాకృతిపై కామెంట్ చేయడానికి మీకెంత ధైర్యం. ఇక్కడి నుంచి వెళ్లిపో’’ అని బదులిచ్చింది.

Untitled-1.jpg


దీంతో ఆమె సమాధానంపై అనేక మంది ప్రశంసలు కురిపించారు. సదరు నెటిజన్ తిక్క కుదిర్చారని రాసుకొస్తున్నారు. కాగా నెటిజన్ల ట్రోలింగ్‌కు కౌంటరివ్వడం సంజనా గణేషన్‌కు ఇది మొదటిసారి ఏంకాదు. 2022లో కూడా ఓ నెటిజన్‌కు ఇలాంటి కౌంటరే ఇచ్చారు. సంజనా గణేషన్, జస్ప్రీత్ బుమ్రా వివాహం 2021 మార్చిలో జరిగింది. ఈ దంపతులకు గతేడాది సెప్టెంబర్‌లో ఓ మగబిడ్డ జన్మించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌తో బుమ్రా బిజీగా ఉన్నాడు. స్పిన్ పిచ్‌లపై సైతం దుమ్ములేపుతున్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో అయితే ఏకంగా 9 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది అవార్డు కూడా అతనికే దక్కింది. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య కీలకమైన మూడో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా జరగనుంది.

Updated Date - Feb 13 , 2024 | 02:15 PM