Share News

SRH vs RR Qualifier 2: టాస్ గెలిచిన రాజస్థాన్.. కెప్టెన్ ఏం ఎంచుకున్నాడంటే!

ABN , Publish Date - May 24 , 2024 | 07:03 PM

ఐపీఎల్-2024లో ఫైనల్ చేరనున్న మరో జట్టు ఏది?... ఈ ప్రశ్నకు మరికొన్ని గంటల్లో సమాధానం రానుంది. ఫైనల్లో చోటే లక్ష్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ షురూ అయ్యింది.

SRH vs RR Qualifier 2: టాస్ గెలిచిన రాజస్థాన్.. కెప్టెన్ ఏం ఎంచుకున్నాడంటే!

చెన్నై: ఐపీఎల్-2024లో ఫైనల్ చేరనున్న మరో జట్టు ఏది?... ఈ ప్రశ్నకు మరికొన్ని గంటల్లో సమాధానం రానుంది. ఫైనల్లో చోటే లక్ష్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ షురూ అయ్యింది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించాడు.


సంజు శాంసన్ మాట్లాడుతూ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎదురయ్యే పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని బౌలింగ్ ఎంచుకున్నామని చెప్పాడు. పూర్తి స్థాయిలో మెరుగవ్వడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పాడు. గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే బరిలో దిగుతున్నామని చెప్పాడు.

సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని చెప్పాడు. బ్యాటర్లు దూకుడు మీద ఉన్నప్పటికీ అన్నిసార్లు అది పనిచేయదని, రెండు రోజుల క్రితం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ ఇదే జరిగిందని ప్రస్తావించాడు. ఉనద్కత్, ఐడెన్ మార్క్‌రమ్ జట్టులోకి వచ్చారని ప్యాట్ కమ్మిన్స్ వివరించాు.


తుది జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టీ నటరాజన్.

రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్, కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యజువేంద్ర చాహల్.

Updated Date - May 24 , 2024 | 07:13 PM