Share News

IPL 2024: దిగ్గజ బ్యాటర్ల సరసన రస్సెల్.. ఆ ఘనత సాధించిన ఆటగాడిగా..

ABN , Publish Date - Apr 04 , 2024 | 04:15 PM

బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ దుమ్ములేపింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో కేకేఆర్ ఆటగాళ్లు చెలరేగడంతో మ్యాచ్ వన్‌సైడేడ్‌గా ముగిసింది. 106 పరుగుల తేడాతో ఢిల్లీపై కోల్‌కతా గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 272/7 పరుగుల భారీ స్కోర్ చేసింది.

IPL 2024: దిగ్గజ బ్యాటర్ల సరసన రస్సెల్.. ఆ ఘనత సాధించిన ఆటగాడిగా..

విశాఖ: బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(Delhi Capitals vs Kolkata Knight Riders) దుమ్ములేపింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో కేకేఆర్ ఆటగాళ్లు చెలరేగడంతో మ్యాచ్ వన్‌సైడేడ్‌గా ముగిసింది. 106 పరుగుల తేడాతో ఢిల్లీపై కోల్‌కతా గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 272/7 పరుగుల భారీ స్కోర్ చేసింది. 7 ఫోర్లు, 7 సిక్సులతో 39 బంతుల్లో నరైన్ 85 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అరంగేట్ర బ్యాటర్ అంక్రిష్‌ రఘువంశీ 5 ఫోర్లు, 3 సిక్సులతో 27 బంతుల్లో 54 పరుగులు చేశాడు. డెత్ ఓవర్లలో రస్సెల్ 4 ఫోర్లు, 3 సిక్సులతో 19 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. అలాగే ఒక ఫోర్, 3 సిక్సులతో రింకూ సింగ్ 8 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. అనంతరం లక్ష్య చేధనలో ఢిల్లీ 166 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్(55), ట్రిస్టన్ స్టబ్స్(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ ఆరోరా మూడేసి వికెట్లు.. స్టార్క్ 2, రస్సెల్, నరైన్ తలో వికెట్ తీశారు.

IPL 2024: రోహిత్ మనసు బంగారం.. హార్దిక్ కోసం ఏం చేశాడో చూడండి..


అయితే 19 బంతుల్లోనే 41 పరుగులతో చెలరేగిన రస్సెల్ ఓ రికార్డు కూడా సృష్టించాడు. తద్వారా ఐపీఎల్ దిగ్గజ బ్యాటర్ల సరసన కూడా చేరాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో కొట్టిన 3 సిక్సులతో ఐపీఎల్‌లో కోల్‌కతా తరఫున రస్సెల్ 200 సిక్సులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా తరఫున 200 సిక్సులు కొట్టిన మొదటి బ్యాటర్‌గా రస్సెల్ చరిత్ర సృష్టించాడు. అలాగే ఐపీఎల్‌లో ఒక ఫ్రాంచైజీ తరఫున 200+ సిక్సులు కొట్టిన ఏడో బ్యాటర్‌గా నిలిచాడు. దీంతో ఐపీఎల్‌లో ఒక ఫ్రాంచైజీ తరఫున 200+ సిక్సులు కొట్టిన రికార్డు క్లబ్‌లో రస్సెల్ కూడా చేరాడు. తన ఐపీఎల్ కెరీర్లో 115 మ్యాచ్‌లాడిన 35 ఏళ్ల రస్సెల్ 29 సగటుతో 2,367 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 101 వికెట్లు తీశాడు. కాగా జాబితాలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున 242 సిక్సులు కొట్టిన విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ఆర్సీబీ తరఫున క్రిస్ గేల్ 239 సిక్సులు, ఆర్సీబీ తరఫున ఏబీ డివిల్లియర్స్ 238 సిక్సులు, ముంబై ఇండియన్స్ తరఫున కీరన్ పొలార్డ్ 223 సిక్సులు, చెన్నైసూపర్ కింగ్స్ తరఫున ధోని 212 సిక్సులు, ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ 210 సిక్సులు కొట్టారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: డేంజర్ జోన్‌లో రిషబ్ పంత్.. మరొక తప్పు చేస్తే..

MI vs RR: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఆ ఘనత సాధించిన ఒకే ఒక జట్టుగా..

Updated Date - Apr 04 , 2024 | 04:15 PM