Share News

French Open: అదరగొట్టిన సాత్విక్‌ - చిరాగ్ శెట్టి.. ఫైనల్స్ దూసుకెళ్లిన జోడీ

ABN , Publish Date - Mar 10 , 2024 | 10:09 AM

ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్ సూపర్‌ 750 టోర్నీ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో భారత జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకి రెడ్డి-చిరాగ్ శెట్టి ఫైనల్స్ దూసుకెళ్లి అదరగొట్టారు. మరోవైపు లక్ష్య సేన్ మాత్రం నిరాశ పరిచారు.

French Open: అదరగొట్టిన సాత్విక్‌ - చిరాగ్ శెట్టి.. ఫైనల్స్ దూసుకెళ్లిన జోడీ

ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్ సూపర్‌ 750 టోర్నీ(french open super 750 tournament) పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో భారత జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకి రెడ్డి(Satwiksairaj Rankireddy)-చిరాగ్ శెట్టి(Chirag Shetty) ఫైనల్స్(finals) దూసుకెళ్లి అదరగొట్టారు. ఈ క్రమంలో పారిస్‌లో జరిగిన మ్యాచులో కొరియాకు చెందిన కాంగ్-మిన్-హ్యూక్, సియో-సెయుంగ్-జే జంటపై 21-13, 21-16 తేడాతో విజయం సాధించారు. అయితే ఈ ఏడాదిలో వీరిద్దరికి ఇది వరుసగా మూడో ఫైనల్ కాగా ఈ టోర్నీలో ఇది మూడోసారి కావడం విశేషం. దీంతో ఈ జోడీ తమ పతకాలను ఖాయం చేసుకున్నారు.


మరోవైపు ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో భారత ఆటగాడు లక్ష్య సేన్(lakshya sen) థాయ్‌లాండ్‌కు చెందిన కున్లావుట్ వితిద్సర్న్ చేతిలో ఓడిపోయాడు. గంటా 18 నిమిషాల వ్యవధిపాటు కొనసాగిన మ్యాచులో 20-22, 21-13, 21-11 తేడాతో లక్ష్య సేన్ ఓటమి చెందాడు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Rahul Dravid: ఇషాన్-శ్రేయాస్ కాంట్రాక్ట్ ఇష్యూపై రాహుల్ ద్రవిడ్ స్పందన

Updated Date - Mar 10 , 2024 | 10:11 AM