Share News

Mumbai Indians: ముంబై ఇండియన్స్ మరో షాక్.. ఆ స్టార్ ప్లేయర్ మరిన్ని ఆటలకు దూరం!

ABN , Publish Date - Mar 28 , 2024 | 07:28 PM

ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఇంతవరకూ బోణీ కొట్టలేదు. ఆడిన మొదటి రెండు మ్యాచుల్లోనూ పరాజయాలను చవిచూసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గెలుపు అంచుల దాకా వెళ్లి ఓడిపోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో దారుణ ఓటమిని మూటగట్టుకుంది.

Mumbai Indians: ముంబై ఇండియన్స్ మరో షాక్.. ఆ స్టార్ ప్లేయర్ మరిన్ని ఆటలకు దూరం!

ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు ఇంతవరకూ బోణీ కొట్టలేదు. ఆడిన మొదటి రెండు మ్యాచుల్లోనూ పరాజయాలను చవిచూసింది. గుజరాత్ టైటాన్స్‌తో (Gujarat Titans) జరిగిన తొలి మ్యాచ్‌లో గెలుపు అంచుల దాకా వెళ్లి ఓడిపోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (Sunrisers Hyderabad) జరిగిన రెండో మ్యాచ్‌లో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఇలాంటి తరుణంలో ఈ జట్టుకి మరో షాక్ తగిలింది. తాజా సమాచారం ప్రకారం.. ముంబైలో అత్యంత కీలక ఆటగాడు, వరల్డ్ నంబర్ 1 బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) మరిన్ని మ్యాచ్‌లకు దూరం కాబోతున్నాడని తెలిసింది. స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ (Sports Hernia Surgery) నుంచి అతను వేగంగానే కోలుకుంటున్నాడు కానీ, రంగంలోకి దిగేందుకు ఇంకొంత సమయం పడుతుందని వెల్లడైంది.

Mumbai Indians: ముంబై ఇండియన్స్ రెండో ఓటమి తర్వాత కీలక పరిణామం.. రోహిత్ శర్మతో ఆకాశ్ అంబాని చర్చలు


ఈ విషయంపై ఓ బీసీసీఐ (BCCI) అధికారి మాట్లాడుతూ.. ‘‘సర్జరీ నుంచి సూర్యకుమార్ వేగంగా కోలుకుంటున్నాడు. ఈ సీజన్‌లో అతడు తప్పకుండా ముంబై జట్టు కోసం ఆడుతాడు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అతను మరికొన్ని ఆటలకు దూరంగా ఉండాల్సి వస్తుంది’’ అని చెప్పారు. జూన్ నెలలో అమెరికా, వెస్టిండీస్‌లలో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) సూర్య పాత్ర ఎంతో ప్రధానమైంది కాబట్టి.. అతని ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అలాగని అతను ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికే దూరంగా ఉండడని, తప్పకుండా ముంబై కోసం బరిలోకి దిగుతాడని, అయితే అందుకోసం అంత తొందరేమీ లేదని ఆ అధికారి పేర్కొన్నారు. అయితే.. సూర్య ఎప్పుడు ముంబై జట్టు కోసం అందుబాటులో ఉంటాడన్న విషయంపై మాత్రం ఆయన పూర్తి స్పష్టత ఇవ్వలేదు. రెండు ఓటములతో ఆ జట్టు ఇప్పుడు కష్టాల్లో ఉంది కాబట్టి.. వీలైనంత త్వరగా సూర్య వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Yuvraj Singh: హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్‌ని బూతులు తిట్టిన యువరాజ్.. కారణం ఇదే!

ఇదిలావుండగా.. 33 ఏళ్ల సూర్య కుమార్ యాదవ్ సౌతాఫ్రికన్ మాజీ ప్లేయర్ ఏబీ డీ విలియర్స్ (AB de Villiers) తరహాలో 360 డిగ్రీ ఆట ఆడుతాడని పేరుగాంచాడు. ఈ పొట్టి ఫార్మాట్‌లో అతడు 171.55 స్ట్రైక్ రేట్‌ని కలిగి ఉన్నాడు. ఇప్పటివరకూ భారతదేశం తరఫున 60 టీ20 అంతర్జాతీయ మ్యాచెస్ ఆడిన అతడు 2141 పరుగులు చేశాడు. అందులో అతను నాలుగు శతకాలు చేశాడు. ఐపీఎల్‌లోనూ మంచి ట్రాక్ రికార్డ్ కలిగిన సూర్య పునరాగమనం కోసం ముంబై జట్టుతో పాటు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 07:30 PM