Share News

Elon Musk Net Worth: గంటకు రూ.3 కోట్లు.. దిమ్మతిరిగే రేంజ్‌లో ఎలాన్ మస్క్ సంపాదన

ABN , Publish Date - Feb 16 , 2024 | 08:51 PM

ఎలాన్ మస్క్ సగటున గంటకు రూ.3 కోట్లు సంపాదిస్తున్నాడని తాజాగా ఓ సంస్థ అంచనా వేసింది.

Elon Musk Net Worth: గంటకు రూ.3 కోట్లు.. దిమ్మతిరిగే రేంజ్‌లో ఎలాన్ మస్క్ సంపాదన

ఇంటర్నెట్ డెస్క్: ఎలాన్ మస్క్ (Elon Musk)..పరిచయం అక్కర్లేని పేరిది. టెస్లా, స్పేఎస్ ఎక్స్, న్యూరాలింక్ సంస్థలను ముందుండి నడిపిస్తున్న మస్క్ ఆదాయం భారీగా ఉంటుందనీ అందరికీ తెలుసు. అయితే, ఫిన్‌బోల్డ్ అనే సంస్థ ఆయన ఆదాయాన్ని మరోరకంగా విశ్లేషించి ఓ నివేదిక రూపొందించింది. ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది.

సంస్థ నివేదిక ప్రకారం, ఎలాన్ మస్క్ గంటకు రూ.3 కోట్లు ఆర్జిస్తారట. అంటే..నిమిషానికి రూ.5.7 లక్షల ఆదాయం. ఇలా ఒక్క వారంలో ఆయన ఏకంగా రూ.576 కోట్లు సంపాదిస్తారని సంస్థ చెప్పుకొచ్చింది. ఫిబ్రవరి నెల నాటి లెక్కల ప్రకారం, ఫిన్ బోల్డ్ ఈ అంచనాకు వచ్చింది. మస్క్ ఆస్తులు, పెట్టుబడులు, స్టాక్స్ అన్ని కలిపి ఆయన ఆదాయాన్ని సంస్థ అంచనా వేసింది. ఫోర్బ్స్ రియల్ టైం డాటా ప్రకారం, మస్క్ నికర సంపద విలువ 205.5 బిలియన్ డాలర్లు.

Viral: ఈ ఏనుగుది ఎంతటి జాలి గుండె? సింహం పిల్లల్ని చంపే గోల్డెన్ ఛాన్స్ వచ్చినా కూడా..


నికర సంపద విలువ ఎలా లెక్కిస్తారంటే..

వివిధ కంపెనీల్లో మస్క్‌ ఉన్న వాటాలను పరిగణలోకి తీసుకుని ఆయన మొత్తం సంపద విలువను (Networth) లెక్కించినట్టు సంస్థ చెప్పుకొచ్చింది. మస్క్‌కు విద్యుత్ వాహనాల సంస్థ టెస్లాలో (Tesla) 20.5 శాతం వాటా ఉంది. ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్‌లో (Starlink) 54 శాతం వాటా ఉంది. ఇక స్పేస్ఎక్స్‌లో (SpaceX) 42 శాతం, ఎక్స్‌లో (X) 74 శాతం, ది బోరింగ్ కంపెనీలో (The Boring Company) 90 శాతం, xAIలో 25 శాతం, న్యూరాలింక్‌లో (Neuralink) 50 శాతానికి పైబడి ఆయనకు వాటాలున్నాయి. ఒక సంవత్సరంలో ఆయన మొత్తం ఆదాయాన్ని కూడితే వచ్చిన మొత్తాన్ని ఏడాదిలో ఉన్న సెకెన్లతో భాగిస్తే ఈ సంఖ్య వచ్చిందని కూడా సంస్థ వివరించింది. ఇటీవల కాలంలో ఆయన సంపద విలువ కాస్త తగ్గినప్పటికీ మొత్తంగా చూస్తే మస్క్ సంపద అపారమని వ్యాఖ్యానించింది.

ViralVideo: ఎవరు బ్రో నువ్వు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు.. నెటిజన్లను షేక్ చేస్తున్న వీడియో ఇది!

ప్రస్తుతం ప్రపంచ అపరకుబేరుల్లో (Worlds Richest) లగ్జరీ ఉత్పత్తుల సంస్థ సీఈఓ బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault) ముందు వరుసలో ఉన్నారు. ఆయన నికర సంపద విలువ 219 బిలియన్ డాలర్లు. రెండో స్థానంలో మస్క్ నిలువగా ఆ తరువాతి స్థానంలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఉన్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ధనిక-పేద అంతరాలు పెరిగిపోతున్నాయని ఆక్స్‌ఫామ్ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. సంపద మొత్తం అతి కొద్ది మందిలో పోగుబడటంతో బలహీన వర్గాలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 16 , 2024 | 08:55 PM